• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

లోక్ సభ స్పీకర్ ఎంపికపై అమిత్ షా ఫోన్ చేశారని ఏపీ సీఎం వెల్లడి

admin by admin
June 23, 2024
in politics
0 0
0
నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

లోక్ సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అయితే ఆ విషయం టీడీపీకి సంబంధంలేదని తాను స్పష్టం చేశానన్నారు. కూటమిలో కీలక పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి పదవులతో సంబంధంలేదని, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. పదవుల కోసం పట్టుబడితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఈ విషయం ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. పదవులు తమకు ముఖ్యంకాదన్నారు. ఈసారి పార్లమెంట్ లో టీడీపీకి 16 ఎంపీల బలం ఉండడంతో ఏపీకి ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు వారికి మార్గనిర్దేశం చేశారు.

ఒక్కో ఎంపీకి మూడు శాఖలు కేటాయిస్తానని, ఆ శాఖకు సంబంధించి రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తీసుకురావాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ ప్రాధాన్యం కావాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పోలవరం, అమరావతిల నిర్మాణం పూర్తిచేసే విషయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

సోమవారం నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో లేవనెత్తాల్సిన అంశాలను, అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలును, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా బైరెడ్డి శబరి, కోశాధికారిగా దగ్గుమళ్ల ప్రసాద్ లను చంద్రబాబు ఎంపిక చేశారు.

Previous Post

లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు -సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవం – టీటీడీ

Next Post

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ 12 కంటెస్టెంట్స్ వీరే

Next Post
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ 12 కంటెస్టెంట్స్ వీరే

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 టాప్ 12 కంటెస్టెంట్స్ వీరే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్
movies

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

by admin
April 18, 2026
0

...

Read more
చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

April 14, 2026
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

April 11, 2026
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In