చేతగాని శౌర్యం.. సోయలేని ప్రకటనలు
అభిమానులు సైతం విస్తుపోతున్న వైనం
గాలిలొ కత్తులు తిప్పుతూ యుద్ధం చేస్తున్నాడు.. గాలిలోనే తలలు తెగిపడుతున్నాయి. అశేష వెర్రి సేనావాహిని వెంట రాగా యుద్ధానికి బయల్దేరి.. అచ్చం నాలుగు రోజుల్లోనే బండారం బయటపడినా డాంబికాలతో కవర్ చేద్దాం అనుకుంటూ మళ్ళీ బొక్కబోర్లా పడిన సేనాని ఇక కత్తి మడత వేసి చంకలో పెట్టుకుని బయల్దేరే పరిస్థితి ఉత్పన్నం అయింది.
నాయకులను సంకెళ్లు వేసి రోడ్లమీద నడిపిస్తూ కొట్టుకుంటూ వెళ్తాను అంటూ చేసిన ప్రకటనతో పవన్ కళ్యాణ్ లో నాయకుడి లక్షణం లేదని తానే క్లారిటీ ఇచ్చేశాడు. అంతకు మించిన భావ దారిద్ర్యము ఏమంటే ఎవరిదగ్గరా లాలూచీ లేకుండా ఏళ్ల తరబడి కాపు ఉద్యమాన్ని మోస్తూ భుజాలు కాయలు కాసిన ముద్రగడ పద్మనాభం వంటివారిని అవమానకరంగా మాట్లాడిన పవన్ తాను ఎప్పటికీ చంద్రబాబు పాలేరును అనే విషయాన్ని మౌఖిక అఫిడవిట్ ఇచ్చారు. గత టిడిపి హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని, ఆయన భార్య, కోడలిని సైతం బూతులు తిడుతూ కొట్టుకుంటూ పోలీసులు అరెస్ట్ చేసిన నాడు పవన్ టిడిపి సర్కారులో భాగస్వామిగా ఉన్నారు. మరి ఆయనకు కాపుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడే ముద్రగడ కు దన్నుగా
నిలవాల్సినది పోయి ఆనాడు చంద్రబాబు ఇచ్చిన దసరా మామూళ్లు లెక్కేసుకుంటూ మైకంలో మునిగితేలారు. నేడు మళ్ళీ మామూళ్ల టైం వచ్చేసరికి కాపు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ ముద్రగడ లాంటి మచ్చలేని నాయకుడి మీద పేలిన సంధి ప్రేలాపనలు పవన్ను ప్రజల్లో మరింత చులకన చేశాయి. ఏనాడూ స్వలాభం కోసం కులాన్ని వాడుకోని ముద్రగడ, ఎప్పుడు ఉద్యమానికి అవసరం అయితే అప్పుడు మేమున్నాం అంటూ అన్నిరకాల అండదండలు సమకూర్చిన ద్వారంపూడి వంటివాళ్ళును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అవమానించడం ద్వారా పవన్ లో గుజ్జులేదని, టిడిపి వాళ్ళు ఇచ్చిన ప్రసంగం చదవడం, ఆ రోజు పేమెంట్ తీసుకుని వెళ్లిపోవడం తప్ప ఇంకేమీ లేదని కాపు యువతకు సైతం అర్థం అయింది.
*నేను మళ్ళీ ఓడిపోతా… కుయ్యో.. మొర్రో*!!
కుక్కలకు ( కాలభైరవుడు) భవిష్యత్ తెలిసిపోతుంది అంటారు.
చంద్రబాబు బిస్కెట్ విసిరి ఎవరిమీద మొరగమంటే వాళ్ళమీద పడి మొరిగే అత్యంత విశ్వసనీయమైన సేనానికి సైతం భవిష్యత్ తెలిసిపోయినట్లుంది. అందుకే నేను మళ్ళీ ఓడిపోయాను అని ఏడుస్తూనే అయినా సరే తాను క్రిమినల్స్ తో యుద్ధం చేస్తున్నాను అంటూ మళ్ళీ రెండంటే రెండే రెండు కన్నీటి బొట్లు కారుస్తూ మగ వగలాడి పాత్ర పోషిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు మోసుకెళ్ళి చంద్రబాబుకు టోకున అమ్ముకుని సొమ్ము చేసుకునే ఉద్దేశ్యంతో మొదలైన వారాహి కి బురదలో పోర్లాడే వరాహానికి తేడా లేకపోయింది అని కాపు యువతతో బాటు కాస్త మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు సైతం తుపుక్కున ఊస్తున్నారు.