• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

admin by admin
October 2, 2024
in politics
0 0
0
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సనాతర ధర్మ పరిరక్షణ కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు. 11 రోజుల పాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపధ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కూతుళ్లు కుమారి ఆద్య కొణిదెల, కుమారి పొలెనా అంజలి కొణిదెలలతో కలసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. మూడంచల భద్రతలో ఉన్న శ్రీ  పవన్ కళ్యాణ్ గారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందని ఆలయ ఆధికారులు తమ విశిష్ట అధికారాలు ఉపయోగించి మహాద్వార ప్రవేశం చేయించారు. తన ఇద్దరు కుమార్తెలతో స్వామి వారి దర్శనానికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ ని స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. క్యూ లైన్లలో అధికంగా భక్తులు ఉండడంతో కేవలం కొద్ది సమయం మాత్రమే స్వామి వారి సేవలో పాల్గొని వెలుపలికి విచ్చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మీడియాకు వారాహి డిక్లరేషన్ ప్రతులను చూపించారు.

•    మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాద స్వీకరణ
స్వామి వారి దర్శనం అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు. అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు. అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు. దర్శనానికి ముందు చిన్న కుమార్తెతో డిక్లరేషన్ చేయించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తిరుమల శ్రీవారి దర్శనానికి మొదటి సారి వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమార్తె కుమారి పొలెనా అంజలీతో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు. కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫాంపై సంతకం చేశారు. కుమారి పొలెనా అంజలి తల్లి శ్రీమతి అనా లెజినోవా గారు క్రైస్తవం పాటించడంతో పిల్లలు కూడా క్రైస్తవమత సంప్రదాయాల ప్రకారం పెరగడంతో ఆలయ నియమాలను అనుసరించి డిక్లరేషన్ ఇప్పించారు. పలు సందర్భాల్లో తన ఇద్దరు పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అన్న విషయాన్ని స్వయంగా వెల్లడించిన విషయం విధితమే. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, తిరుపతి, రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, శ్రీ అరవా శ్రీధర్ గారు, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Previous Post

గ్రీన్ ఎనర్జీ హబ్ గా రాయలసీమ – సిఎం చంద్రబాబు

Next Post

ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Next Post
ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా సమాజ్ వాది పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్
movies

నటుడిగా వెండితెరపై.. సేవామూర్తిగా నిజ జీవితంలో: బహుముఖ ప్రజ్ఞాశాలి అఫ్సర్ ఆజాద్

by admin
April 23, 2026
0

...

Read more
శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

శ్రీకాకుళంలో విద్యాశాఖలో ఉద్యోగాల పేరిట లక్షల్లో వసూళ్లు.. ఎవరీ శేషగిరి?

April 23, 2026
భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల

April 23, 2026
ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా ‘పరమపద సోపానం’ ప్రీ రిలీజ్ ఈవెంట్

April 21, 2026
దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్

April 21, 2026
మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసిన “ది బ్రేకింగ్ న్యూస్” ఫస్ట్ లుక్

April 18, 2026
చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

April 14, 2026
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In