• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

admin by admin
February 2, 2026
in movies
0 0
0
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా మా సినిమాకు నష్టాన్ని కలిగించారు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటించిన యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం “వన్ బై ఫోర్” (One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మించారు. ఇటీవల రిలీజైన “వన్ బై ఫోర్” (One/4) సినిమా మంచి విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో..

డైరెక్టర్ బాహుబలి పళని మాట్లాడుతూ – మా “వన్ బై ఫోర్” (One/4) సినిమాను ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేశారు. ప్రతి థియేటర్ లో కలెక్షన్స్ బాగున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికి కూడా మంచి విజయం అందిస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. మా హీరో వెంకటేష్ తన ఫైట్స్, పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతను కన్నడలో యాక్షన్ సినిమా చేశాడు. తెలుగులో వెంకటేష్ కు మంచి అవకాశాలు వస్తాయి. మా ప్రొడ్యూసర్స్ రంజన, రోహిత్ ముంబై నుంచి సినిమా మీద ప్యాషన్ తో టాలీవుడ్ కు వచ్చారు. వారు మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా ప్రారంభంలో అవకాశాల కోసం వచ్చే నటీనటులు, సినిమా ప్రమోషన్ లో కనిపించరు. వారు తమ సినిమా అనే కృతజ్ఞతతో ప్రమోషన్ చేయాలి అన్నారు.

ప్రొడ్యూసర్ రంజన రాజేష్ గుంజల్ మాట్లాడుతూ – ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి మెసేజ్ ఉన్న మా “వన్ బై ఫోర్” (One/4)సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటం వల్లే ఈ విజయం దక్కింది. ఈ చిత్రంలో పవిత్ర అనే క్యారెక్టర్ కు అప్రిషియేషన్ వస్తోంది. హీరో వెంకటేష్ పర్ ఫార్మెన్స్ బాగుందని అంటున్నారు. బ్లాక్ మెయిలింగ్ వల్ల ఓ మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది మా సినిమాలో చూపించాం. ఈ సినిమా మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. మా చిత్రానికి హీరోయిన్స్ నుంచి ప్రమోషన్ కోసం సపోర్ట్ లభించకపోవడం బాధగా ఉంది. హీరోయిన్స్ ప్రమోషన్ కు రాకుండా సినిమాకు నష్టాన్ని తీసుకొచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించినా వారు సినిమా పట్ల కృతజ్ఢత చూపించలేదు. ఇలాంటి నార్త్ హీరోయిన్స్ కంటే తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా తీసుకుని వారిని ప్రోత్సహించడం మంచిది అని అనిపిస్తోంది అన్నారు.

ప్రొడ్యూసర్ రోహిత్ రాందాస్ గుంజల్ మాట్లాడుతూ – తెలుగు సినిమాలపై అభిమానంతో మేము ముంబై నుంచి టాలీవుడ్ కు వచ్చాం. మా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది. మేము ఈ చిత్రం ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. కలెక్షన్స్ బాగున్నాయి. ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ మోసం చేయరు. కానీ మా చిత్రంలోని నటీనటులే ప్రమోషన్ కు రాకుండా ఇబ్బందిపెట్టారు. లేకుంటే మా సినిమా మరింతగా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లేది అన్నారు.

హీరో వెంకటేష్ పెద్దపాలెం మాట్లాడుతూ – “వన్ బై ఫోర్” (One/4) సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. బయట ఇండస్ట్రీలోని ఇతర పెద్ద సినిమాల వల్ల రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ మా ప్రొడ్యూసర్స్ పట్టుదలగా ఈ అడ్డంకులన్నీ దాటుకుని సినిమాను విడుదల చేశారు. అన్ని థియేటర్స్ నుంచి మంచి టాక్ ఉంది. మహిళలు చూడాల్సిన చిత్రమిది. మంచి సినిమా చేశారని అంటున్నారు. ఇంకా ప్రమోషన్స్ చేద్దామంటే మా హీరోయిన్స్ ప్రెస్ మీట్స్ కు రావడం లేదు. ఎంతో ప్యాషన్ తో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రమోషన్స్ కు రాని నటీనటులు ఆలోచించుకోవాలి అన్నారు.

నటీనటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ, రాజు, అపర్ణ శెట్టి, మధుసూదన్ రావు, సునీత మనోహర్, శ్రీనివాస్ భోగిరెడ్డి, వేడిష్ జవేరి, కుష్బూ, సుజాత, ఎస్ ఆర్ ఎస్ వర్మ, సుహాని వ్యాస్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్
నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్
దర్శకుడు: బాహుబలి పళని కె
సంగీతం: సుభాష్ ఆనంద్
డి ఓ పి: గుణ శేఖర్
లిరిక్స్: సాగర్ నారాయణ ఎమ్. నాగేంద్ర గోపు
డాన్స్: సాగర్ వేలూరు
స్టంట్ మాస్టర్: కుంగ్ ఫు చంద్ర, జాషువా
వి ఎఫ్ ఎక్స్: నవీన్ ఏ, పవన్ నారావా
ఎస్ ఎఫ్ ఎక్స్: పురుషోత్తం రాజు
మిక్సింగ్: జయంతం సురేష్
పీఆర్ఓ – చందు రమేష్

Previous Post

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

Next Post

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

Next Post
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

"అమరావతికి ఆహ్వానం" సినిమా టీజర్ విడుద‌ల‌,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In