విశాఖపట్నం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ గురించి జరిగిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈనెల 20న ముగుస్తుండడంతో ఆరోజు ఏర్పాటు చేసిన యువగళం నవశకం భారీ బహిరంగ సభ విజయవంతం చేయటకు కార్యక్రమ పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.