• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం; లోకేష్

admin by admin
August 7, 2024
in politics
0 0
0
రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం; లోకేష్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమరావతి: ఎపిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీని ఏర్పాటుచేస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం పనితీరు, ర్యాంకింగ్ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటుచేయాలి, ఎకోసిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ తదితర 16రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఎఐ టెక్నాలజీద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని అన్నారు. దీనిద్వారా విద్యార్థుల అటెండెన్స్ తోపాటు వారి తెలివితేటలను అంచనా వేసి, మెరుగు పర్చడానికి ఆస్కారమేర్పడుతుందని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైనందున వచ్చే ఏడాదినుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలుచేయాలని ఆదేశించారు. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సమీక్షిస్తూ మెరుగైన ఫలితాల సాధనకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ఏర్పాటైన హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ మానిటరింగ్ కమిషన్ చేపడుతున్న చర్యలపై చర్చించారు. అకడమిక్ ఎక్సెలెన్స్ , ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ పై దృష్టిసారించి, ర్యాంకింగ్ మెరుగుదలకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ర్యాంకింగ్స్ విషయంలో ఆంధ్రా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, జెఎన్ టియు (కాకినాడ) మాత్రమే సంతృప్తికర పనితీరు కనబరుస్తున్నాయని

అన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు. యూనివర్సిటీల్లో పరిశోధనలు పెరగాల్సి ఉందని, పరిశ్రమ అనుసంధానిత ఇంటర్న్ షిప్, అప్రెంటీస్ షిప్ లు విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యార్థులు కులధృవీకరణ పత్రాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. యూనివర్సిటీల్లో విసీల నియామక ప్రక్రియ మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆర్జెయూకెటిలను రాజకీయాలకు అతీతంగా విద్యారంగనిపుణులతో మెరుగ్గా తీర్చిదిద్దుతాతమని తెలిపారు. సమర్థవంతమైన నిర్వహణ కోసం నిపుణులతో ఎక్స్ పర్ట్ కమిటీ నియామకం, ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా సమీకృత సేవలు అందించడం, అప్రెంటీస్ ఎంబడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ పనితీరు తదితర అంశాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు.
ఈ సమావేశంలో ఉన్నతవిద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్ మెంట్ విసి అండ్ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు.

Previous Post

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా “మన్మయి” సినిమా టీజర్ విడుదల

Next Post

క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌ పుస్తకాలు..ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలివే!

Next Post
క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌ పుస్తకాలు..ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలివే!

క్యూఆర్‌ కోడ్‌తో పాస్‌ పుస్తకాలు..ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలివే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం
politics

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

by admin
September 8, 2026
0

...

Read more
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In