నరసాపురం ఎంపీ రఘురామపై కేసు నమోదైంది.ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కే ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు.