పెంచిన ఆర్టీసీ ఛార్జీల ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.. పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారి ఆధ్వర్యంలో ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అప్పటి టిడిపి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచుతుందని తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ ఛార్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని హామీ ఇచ్చారని అయితే నేడు చార్జీలను పెంచి అన్ని రకాల ప్రజలు సామాన్య, పేద, మధ్య తరగతి వారి, ప్రతి ఒక్క సామాన్యుడి నడ్డి విరిచారని రెడ్డి అప్పల నాయుడు ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.
ఇంతేకాకుండా మూడు నెలల కాలంలో డీజిల్ ధర పెంపు సాకుతో ఆర్టీసీ ఛార్జీలను రెట్టింపు చేశారన్నారు.. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, విద్యుత్, గ్యాస్ ధరలు తదితర ఛార్జీలు పెంపు సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపడమే అని అన్నారు.ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని లేని పక్షంలో జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.