• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఈ టీవీలో సరికొత్త రియాలిటీ షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌… ఒకరికి ఒకరు

admin by admin
October 10, 2022
in movies
0 0
0
ఈ టీవీలో సరికొత్త రియాలిటీ షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌… ఒకరికి ఒకరు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఈ టీవీలో ట్రెండీగా రాబోతున్న సరికొత్త రియాలిటీ షో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌….ఒకరికి ఒకరు
తెలుగు టీవి రంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తుంది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ. దర్శకుడు అనిల్‌ కడియాలను, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థను ఈటీవి మొదటినుండి ఎంతో సపోర్టు చేయటంతో అనేక బ్లాక్‌బస్టర్‌ టీవీషోలను అనిల్‌ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఉదాహరణకు అనిల్‌ కడియాల దర్శకత్వంలో ఈ టీవీలో గత ఆరేళ్లుగా ‘అలీతో సరదాగా’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ‘వావ్‌’,‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ వంటి అనేక షోలతో పాటు పండగల పూట ప్రసారమయ్యే స్పెషల్‌ షోలను డిజైన్‌ చేసి దర్శకత్వం వహించారు అనిల్‌ కడియాల. ఈ షోలన్నింటికి కంటెంట్‌ పార్టును దగ్గరుండి చూసుకుంటూ నిర్మాతగా వ్యవహరించే వ్యక్తే ప్రవీణా కడియాల. నిర్మాత–దర్శకులిద్దరూ భార్య,భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్‌ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే స్పీడుతో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌’ ఒకరికి ఒకరు అనే ట్యాగ్‌లైన్‌తో సరికొత్తగా షోను డిజైన్‌ చేసి పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కంటెంట్‌ను ఎంతో క్రియేటివ్‌గా డిజైన్‌ చేసిన నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ–‘‘ ఈటీవిలో అక్టోబర్‌ 11న ప్రారంభం అవుతుంది మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఒకరికి ఒకరు. ప్రతి మంగళవారం రాత్రి 9–30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోద్వారా ప్రముఖ నటి స్నేహ తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం విశేషం. స్నేహతో పాటు నటుడు శివబాలాజి ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచి ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ స్లోగన్‌ను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పెషల్‌ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్‌. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు’’ అన్నారామే.
మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ పోటీలో పాల్గొంటున్న పదిజంటలు..1. రవికిరణ్‌–సుష్మా 2. పవన్‌–అంజలి 3. సందీప్‌–జ్యోతి 4. హ్రితేష్‌–ప్రియా 5. శ్రీవాణి–విక్రమ్‌ 6. మధు–ప్రియాంక 7. ప్రీతమ్‌–మానస 8. సిద్దు–విష్ణుప్రియ 9. రాకేశ్‌–సుజాత 10. విశ్వ–శ్రద్ధ ఈజంటలందరూ బుల్లితెరపై అందరికి సుపరిచితులే. అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నవారే. ఈ అందరినీ కలుపుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌తో మాస్‌ అభిమానులను సొంతం చేసుకున్న లేడి మాస్‌ స్టార్‌ శ్రీముఖి ఈ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

Previous Post

విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ సమక్షంలో ‘నిన్నే పెళ్లాడతా’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Next Post

వికేంద్రీకరణ పేరిట వైసీపీ వీధి నాటకాలు ; జనసేన

Next Post
వికేంద్రీకరణ పేరిట వైసీపీ వీధి నాటకాలు ; జనసేన

వికేంద్రీకరణ పేరిట వైసీపీ వీధి నాటకాలు ; జనసేన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!
movies

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

by admin
July 21, 2026
0

...

Read more
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In