• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అలరించే సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘ మయూరాక్షి ‘

admin by admin
June 3, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై జనతాగ్యారేజ్, భాగ‌మ‌తి ఫేం ఉన్ని ముకుంద‌న్, మియా జార్జ్ జంటగా రూపొందిన చిత్రం `మ‌యూరాక్షి` .  యువ నిర్మాత వ‌రం జ‌యంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీసుంద‌ర్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్ల‌ర్  ప్రేక్షకులను ఏమాత్రం అలరించింది అనేది చూద్దాం పదండి.

కథ: డాక్టర్ అజయ్… కేంద్ర మంత్రి చౌడప్ప మనుమరాలు ఝాన్సీ ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఒకరోజు కేంద్రమంత్రి చౌడప్ప హెల్త్ చెక్ అప్ కోసం జూనియర్ డాక్టర్ అజయ్ పనిచేసే ఆసుపత్రికి వెళతాడు. అక్కడ మంత్రికి బిపే ఎక్కువగా ఉండటంతో… డాక్టర్ అజయ్ ఇచ్చిన ఓ ఇంజెక్షన్ కారణంగా కేంద్ర మంత్రి గుండె పోటుతో మరణిస్తాడు. అయితే మంత్రికి గుండె పోటు వచ్చింది అజయ్ ఇచ్చిన ఇంజక్షన్ కారణంగానే మంత్రి మరణించాడని పోలీసులు అజయ్ పై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. మరి కేంద్ర మంత్రి అజయ్ ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగానే మరణించాడా? డాక్టర్ అజయ్ ఈ కేసు నుంచి బయటపడ్డారా? డాక్టర్ అజయ్ కి… రాజీవ్ (ఉన్ని ముకుందన్) ఎలా సహాయపడ్డారు? మరి టైటిల్ రోల్ పోషించిన మయూరాక్షి (మియ జార్జి) ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: మెడికల్ క్రైం బేస్డ్ గా తెరకెక్కిన మూవీస్ ఎప్పుడూ థ్రిల్లింగ్ గానే వుంటాయి. వాటికి కొంచం సస్పెన్స్ కూడా జోడిస్తే ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చెయ్యొచ్చు. తాజాగా విడుదలైన ఈ మాయూరాక్షి కూడా అలాంటి మంచి ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లరే. ఫస్ట్ హాఫ్ అంతా డాక్టర్ అజయ్, ఝాన్సి ల మధ్య లవ్ ట్రాక్ ను సోసో గా నడిపించి ఇంటర్వల్ బ్యాంగ్ లో మంచి ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటర్వల్ తరవాత అసలైన కథను అనేక మలుపులతో నడిపించి ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చేశాడు దర్శకుడు. ఉన్ని ముకుందన్ , మియా జార్జ్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. అలానే మినిస్టర్ మర్డర్ మిస్టరీలో వుండే మలుపులు, కోర్టు సీన్ ఆకట్టుకుంటాయి.

ఇప్పటికే టాలీవుడ్ లో జనతా గ్యారేజ్, భాగమతి సినిమాలతో తెలుగు ప్రేకషకులకు బాగా పరిచయం అయిన మలయాళ యువ హీరో ఉన్ని ముకుంద న్ ఇందులో లవర్ బాయ్ గా, ఇన్వెస్టిగేటివ్ అధికారిగా ఆకట్టుకున్నాడు. అతనికి జంటగా నటించిన మియా కూడా అడవి బిడ్డగా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నటించి మెప్పించింది. డాక్టర్ అజయ్, అతనికి జంటగా నటించిన ఝాన్సీ కూడా బాగా నటించారు. ఝాన్సీ అమ్మగా, సుప్రీమ్ కోర్టు లాయర్ గా నటించిన నటీమణి కూడా కోర్టు సీనుతో మెప్పించింది. కేంద్ర మంత్రిగా, అతని కుమారుని గా నటించిన ఇద్దరు నటులూ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాసుకున్న కథ…. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ద్వితీయార్థంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఎంతో థ్రిల్ కు గురి చేస్తాయి. గోపి సుందర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి యాప్ట్ గా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పిగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

Previous Post

ఘనంగా జయహో రామానుజ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ

Next Post

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభంమైన పాన్ ఇండియా మూవీ “సాచి “

Next Post

మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభంమైన పాన్ ఇండియా మూవీ "సాచి "

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్
movies

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

by admin
September 10, 2026
0

...

Read more
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In