చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన “మా నాన్న నక్సలైట్” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 8న విడుదలకు సిద్ధంగా ఉంది. తొంభై వ దశకంలో ని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక నక్సలైట్ తండ్రి కథ. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచే కొండరుద్ర సీతారామయ్య పాత్రను పోషించారు. నటుడు అజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే సుబ్బరాజు రాజకీయ నాయకుడు పాత్రలో నటించగా జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ రావు పాత్రలో ఎల్ బి శ్రీరామ్ నటించారు. యువ జంటగా కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం అందించింది ప్రవీణ్ ఇమ్మడి. ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత చదలవాడ శ్రీనివాస్, రేలంగి నరసింహారావు, దర్శకులు అజయ్, ప్రసన్న కుమార్, కాశీ విశ్వనాధ్ మరియు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ కథ చెప్పినప్పుడు, హృదయానికి హత్తుకునే సినిమా, చాలా మంచి చిత్రం అవుతుందని , ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని . తల్లి తండ్రి కొడుకు కూతురు అందరూ కలిసి చూసే చిత్రం అవుతుందని ,ఫ్యామిలీ ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయే చిత్రం ఇది అవుతుందని నాకు అనిపించింది. నాకు బాగా నచ్చి నిర్మించిన చిత్రం ఇది. నేను ఈ చిత్రం చూశాను, గతంలో మాతృదేవోభవ చిత్రం చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యానో ఈ చిత్రం చూసాక అంతే అనుభుతికి లోనయ్యాను. చిత్రం చూసిన ప్రతి ప్రేక్షకుడు తన తండ్రిని గుర్తు చేసుకుంటాడు. మా నాన్న నక్సలైట్ చిత్రం ఈ నెల జులై 8న విడుదల అవుతుంది. అందరూ చూసి ఆదరించండి” అని కోరుకున్నారు.
రేలంగి నరసింహారావు గారు మాట్లాడుతూ “దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. తన మొదటి సినిమా నుంచి తనతో ట్రావెల్ చేస్తున్నాను. నా చిత్రాలకి కూడా సునీల్ గారు తన సహకారం అందిస్తారు. మా నాన్న నక్సలైట్ చిత్రం టైటిల్ చాలా గొప్పగా ఉంది. సునీల్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు చేస్తారు. స్టార్ హీరో ని నమ్మలేదు కేవలం కథను మాత్రమే నమ్మి సినిమా చేస్తారు. ఒక మంచి దర్శకుడికి చదలవాడ శ్రీనివాస్ వంటి మంచి నిర్మాత తోడయ్యాడు. చదలవాడ శ్రీనివాస్ గారికి సెంటిమెంట్ చిత్రాలు అంటే చాలా ఇష్టం. కేవలం కథ ను మాత్రమే నమ్ముతారు . మరి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అంటే అది సూపర్ హిట్ చిత్రమే అవుతుంది. ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే దాసరి నారాయణ రావు గారు తీసిన ఒసేయ్ రాములమ్మ చిత్రం గుర్తుకు వచ్చింది. ట్రైలర్ చాలా ఎమోషనల్ గా ఉంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
దర్శకుడు అజయ్ గారు మాట్లాడుతూ “మా నాన్న నక్సలైట్, ఇలాంటి టైటిల్ పెట్టి సినిమా తీయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమా తీసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి మరియు నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారికి హాట్స్ ఆఫ్. మామూలుగా నక్సలైట్ అంటేనే ఒక వ్యతిరేక భావం కలుగుతుంది మరి ఇలాంటి కథకి సెంటిమెంట్ కథాంశం జోడిస్తే చాలా గొప్ప చిత్రం అవుతుంది. ప్రతి మనిషి స్వార్ధపరుడు. నేను నా కుటుంభం అని పని చేస్తాడు. కానీ నక్సలైట్ తన కుటుంబాన్ని కూడా వదిలేసి ప్రజలు బాగుండాలి ఊరు బాగుండాలి అని వారి జీవితం త్యాగం చేస్తాడు. మా నాన్న నక్సలైట్ చాలా గొప్ప కథ. తండ్రి కొడుకుల కథ. జులై 8న విడుదల అవుతుంది. మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ “సునీల్ కుమార్ రెడ్డి గారు గౌరవప్రదమైన దర్శకుడు. వారి చిత్రం లో నటించడం చాలా సంతోషంగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ చిత్రం తీయడం సునీల్ కుమార్ రెడ్డి గారికి సాధ్యం. మా నాన్న నక్సలైట్ చాలా గొప్ప సినిమా అవుతుంది. నేను ఈ చిత్రం లో ఒక తండ్రి పాత్ర చేశాను. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని చదలవాడ శ్రీనివాస్ గారు నిర్మించారు. ఈ చిత్రం జులై 8 న విడుదల అవుతుంది. మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ “మా నాన్న నక్సలైట్ అనేది గొప్ప టైటిల్. నక్సలైట్ అనగానే మనకు కొండరుద్ర సీతారామయ్య గారు గుర్తుకు వస్తారు. మరి అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రఘు కుంచే కనిపిస్తాడు. ఒక గాయకుడిగా సింగర్ గా ఇప్పుడు నటుడిగా మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం తో మరో మెట్టు ఎక్కుతున్నాడు. ఈ చిత్రం లో తండ్రి గొప్పతనం చూడబోతున్నాం. చదలవాడ శ్రీనివాస్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన 15 చిత్రాలు నిర్మిస్తున్నారు. అని మంచి చిత్రాలే. ఈ చిత్రం జులై 8 న విడుదల అవుతుంది. మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
లిరిక్ రైటర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ “మా నాన్న నక్సలైట్ టైటిల్ లోనే నెగిటివ్ మరియు పాజిటివ్ ఉంది. రక్త సంబంధం అంటే ఏమిటి, కడుపు కోత ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రంలో చూపించారు. నేను ఈ చిత్రం లో వయసైపోయింది కొడకో అనే పాట రాసాను. పాట చాలా బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి నిర్మాత చదలవాడ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను” అని తెలిపారు
నటుడు కృష్ణ మాట్లాడుతూ “నా మొదటి చిత్రం క్రష్, రవి బాబు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మా నాన్న నక్సలైట్ చిత్రం తో మీ ముందుకు వస్తున్నాను. ప్రతి తల్లీ తండ్రి చాలా కష్ట పడి వాళ్ళ పిల్లలను చదివిస్తారు మంచి స్థాయి లో నిలబడతారు. కానీ కొందరు పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల చేసే వృత్తి చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ కొందరు చాలా గర్వంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసే వృత్తి గురించి చెప్పు కుంటారు. ఈ చిత్రం కథ ఇలాంటి పిల్లల కథ. ప్రతి తండ్రి కొడుకు చూడాల్సిన చిత్రం ఇది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. రఘు కుంచే గారు నాకు తండ్రిగా చేసారు. చాలా మంచి నటుడు. సుబ్బా రాజు గారు, అజయ్ గారు, జీవ గారు ఎల్ బి శ్రీరామ్ గారు వీళ్ళతో నటించడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రం జులై 8న విడుదల అవుతుంది. అందరూ చూడండి” అని కోరుకున్నారు.
నటి రేఖ నిరోషా మాట్లాడుతూ “నాకు ఈ చిత్రం లో అవకాశం ఇచ్చిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఈ చిత్రం లో కాశీ విశ్వనాధ్ గారు నాకు తండ్రి గా నటించారు. సర్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్న నక్సలైట్ చాలా మంచి చిత్రం, అందరూ చూడండి” అని తెలిపారు.
దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “మా నాన్న నక్సలైట్ చిత్రం జులై 8న విడుదల అవుతుంది. చదలవాడ శ్రీనివాస్ గారు నిర్మిస్తున్నారు. మీడియా మిత్రులు అందరి సపోర్ట్ కావాలి. మంచి సినిమా ఇది. ఈ చిత్రం నేను నా తండ్రి కి ఇచ్చే సెల్యూట్, నా కొడుకు కి ఇచ్చే గిఫ్ట్. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు, వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతారు. ప్రతి తండ్రి తన కొడుకు ని దగ్గరకు తీసుకుంటాడు అని కోరుకుంటున్నాను. అందరూ సినిమా చూడండి. మంచి ఫీల్ ఉన్న చిత్రం అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
బ్యానర్ : అనురాధ ఫిలిమ్స్ డివిజన్
చిత్రం పేరు : మా నాన్న నక్సలైట్
నటి నటులు : రఘు కుంచే, అజయ్, సుబ్బ రాజు , ఎల్ బి శ్రీరామ్, జీవ, కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా, వినయ్ మహాదేవ్, అనిల్, ఎఫ్ ఎమ్ బాబాయ్, సముద్రం వెంకటేష్, బుగత సత్యనారాయణ , అంకోజీ రావు , కాశి విశ్వనాథ్, కనకా రావు, ప్రసన్న కుమార్, పద్మజ లంక, డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, తదితరులు
సంగీతం : ప్రవీణ్ ఇమ్మడి
లిరిక్స్ : యక్కలి రవీంద్ర బాబు, గమన్ శ్రీ, పెద్దాడ మూర్తి,
కెమెరా : ఎస్ వి శివ రామ్
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
రచన, దర్శకత్వం : పి. సునీల్ కుమార్ రెడ్డి
నిర్మాత : చదలవాడ శ్రీనివాసరావు