• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

admin by admin
April 25, 2026
in movies
0 0
0
‘కన్న’ మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మాధురి ప్రజెంట్స్, పాషనేట్ ఫిలిం మేకర్స్, సినిమాటిక్ విజువల్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం కన్న. ఎస్ఎన్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం కన్న టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మఖ్యఅతిథిగా హీరో చైతన్య రావు, హీరో కార్తిక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, మంజు వెంకట్, సినిమా యాక్టర్స్, టెక్నీషన్స్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యరావు చేతులు మీదుగా విడుదలైన కన్న టీజర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో హీరో కార్తీక్ శివన్, హీరోయిన్ గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, ప్రేమ్ కృష్ణ , సూరజ్, రామ్ పటాస్, వేణు, డైరెక్టర్ నాని కాసరగడ్డ, రవీంద్ర, వెంకీ, మురళి, బంటు, మంజు వెంకట్, దేవా, బృందావనం మూవీ టీమ్, మేకర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యాక్టర్ వెంకీ మాట్లాడుతూ… ఇది చిన్న సినిమా కావచ్చు కానీ అందరు గుర్తు పెట్టుకునే సినిమా అవుతుంది అన్నారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. హీరోయిన్ గీతికా రథన్ మాట్లాడుతూ..టీజర్ చుస్తే చిన్న సినిమాలా అనిపించడం లేదన్నారు. ఈ సినిమాలో తాను సత్య పాత్ర పోషించినట్లు చెప్పారు. ఈ మూవీ చూసిన తరువాత అందరూ తనను సత్య అని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి కి థాంక్స్ చెప్పారు. అందరు సినిమాకు సపోర్ట్ చేయాలని కోరారు.

హీరో కార్తిక్ శివన్ మాట్లాడుతూ.. పిలవగానే వచ్చిన హీరో చైతన్య రావుకు థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం తనకు ఏ సినిమా బ్యాగ్రౌండ్ లేదన్నారు. ఇప్పటి వరకు తన వెన్నంటి నడిపిన తన తండ్రినే తనకు బ్యాగ్రౌండ్ అని చెప్పారు. అలాగే సినిమా చుసిన తరువాత ఈ మూవీ తనకు బ్యాగ్రౌండ్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. క్రికెట్, లవ్, ఎమోషనల్ స్టోరీ ఈ మూడు ఎమోషన్స్ ప్రధానంగా సినిమాలో చూపించినట్లు చెప్పారు. ఇక ఈ కన్న చిత్రం పరిశ్రమలో నిలిచిపోతుంది చెప్పారు. సినిమాకు సపోర్ట్ చేస్తూ.. ప్రొడ్యూస్ చేసిన నిర్యాత శ్రీను కు థాంక్స్ చెప్పారు. సినిమా అద్భుతంగా తీర్చిదిద్దిన డైరెక్టర్ రాజశేఖరరెడ్డి కి థాంక్స్ చెప్పారు. సొంత అన్న గురించి ఇంతకన్న ఎక్కువ చెప్పలేనని తెలిపారు. అలాగే హీరోయిన్ గీతికా ప్రాణం పెట్టి చేశారు అని చెప్పారు. తనకు కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు. మా టీమ్ అంతా ఈ పరిశ్రమలో ఇప్పుడు ఎంట్రీ పాస్ తీసుకున్నామని, మా నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు

ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ..డైరెక్టర్ ఎంతో సహనంతో ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు. సినిమా ఒక నిర్మాతగా ఉన్నా అసిస్టెంట్ గా వర్క్ చేసినట్లు వెల్లడించారు. సినిమా అంటే ఎంతో ఇష్టం అందుకే సినిమాకు సంబంధించిన ఏ పని అయినా చేస్తా అని చెప్పారు. కన్న సినిమాలో యాక్ట్ చేసిన ప్రతీ ఒక్క నటీనటులకు, టెక్నిషన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ.. ఈ టీజర్ లా కాదు ఒక ట్రైలర్ చుసినట్లు తృప్తిగా ఉందన్నారు. ఈ సినిమా ప్యాషనెట్ తో తెరకేక్కించనట్లు అర్థం అవుతుందని చెప్పారు. ఈ ఐపిఎల్ సీజన్ లో కన్న రైట్ సినిమా, కచ్చింతంగా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు.

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… పిలువగానే వచ్చిన హీరో చైతన్య రావు కి థాంక్స్ చెప్పారు. ఆయన సినిమాలకు ఏడి గా పనిచేసానని చెప్పారు. ఆయన మెథడ్ యాక్టింగ్ చాలా నచ్చుతుందని చెప్పారు. ఆయనతో పనిచేయాలని ఉందని, భవిష్యత్తు ఆ అవకాశం వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అలాగే మంజు వెంకట్ కు థాంక్స్ చెప్పారు. చిన్న సినిమా అని చెప్పగానే సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు. అల్లరి నరేష్ తో సినిమా చేసిన డైరెక్టర్ నాని కాసరగడ్డ ఈవెంట్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్ చెప్పారు. స్పిరిట్ కు పనిచేస్తున్న డీఓపీ గుణశేఖర్ మా సినిమాకు పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మా కాంబినేషన్ మంచి హిట్ అవుతుందని చెప్పారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ సాంగ్స్ అద్భుతంగా ఇచ్చారు అని చెప్పారు. అలాగే ఎడిటర్ కోడటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ స్టైల్ అందరికి నచ్చుతుందని చెప్పారు. యాక్టర్ రూపేష్ ఒక అద్భుతమైన యాక్టర్ అని చెప్పారు. ఆయన విలన్ కాదు యాంటీహీరో రోల్ చేసారని చెప్పారు. సినిమాలో యాక్ట్ చేసిన ప్రతీఒక్కరు ప్రాణం పెట్టి చేశారు అని చెప్పారు.

అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ కూడా చాలా కష్టపడ్డారని చెప్పారు. హీరోయిన్ గీతికా చూడడానికి అందంగా ఉండటం మాత్రమే కాదు చాలా ప్రతిభ ఉందని, ప్రతి విషయంలో కష్టపడుతుందని చెప్పారు. క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉందన్నారు. మంచి పేరు వస్తుందన్నారు. ఇక హీరో కార్తిక్ శివన్ సొంత తమ్ముడు అని కాదు చాలా కష్టపడే వ్యక్తి అన్నారు. మంచి యాక్టర్ అవుతారని, రేపటి రోజు కార్తిక్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు అని చెప్పారు. సినిమా క్రికెట్ చుట్టూ సీరియస్ గా కాదు చాలా సరదాగా, మన చిన్నతనంలోని చాలా విషయాలను గుర్తు చేస్తుందని చెప్పారు. ఈ సినిమాలో కార్తిక్ క్యారెక్టర్ కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుందని చెప్పారు. సినిమాలో కన్న లాంటి క్యారెక్టర్ ప్రతీ ఊరిలో ఒక్కడు ఉంటాడు అని చెప్పారు. కన్న సినిమా టీజర్ ఎంతలా నచ్చిందో సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుందని తెలిపారు.

హీరో చైతన్య రావు మాట్లాడుతూ.. డైరెక్టర్ రాజశేఖర్ ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి అన్నారు. కచ్చితంగా మంచి డైరెక్టర్ అవుతారు అని చెప్పారు. ఆయనతో కలిసిపనిచేస్తానని చెప్పారు. మనం పని చేసుకుంటూ పోవడమే ఫలితంతో సంబంధం లేదన్నారు. ఈ టీజర్ చూస్తుంటే మలయాళం సినిమా చూసినంత ఫీల్ ఉందని, విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందన్నారు. ఎడిటింగ్ కట్స్ కూడా చాలా బాగున్నాయరు. హీరోగా యాక్ట్ చేసిన కార్తీక్ చాలా పోటెన్షల్ ఉన్న యాక్టర్ లా కనిపిస్తున్నాడు అని, ప్రతీ ఫ్రేమ్ లో కన్న క్యారెక్టర్ కనిపిస్తుందని చెప్పారు. ఇక హీరోయిన్ గీతికాకు ఈ సినిమా మంచి పేరును తీసుకొస్తుందని చెప్పారు. ఇలాంటి చిన్న సినిమాలు ఇండస్ట్రీలో నిలబడాలని.. ఈ సినిమాకోసం ఏ విధంగానైన తాను సాయం అందిస్తానని చెప్పారు.

చిత్రం: కన్న
బ్యానర్ : ప్యాషనట్ ఫిలిం మేకర్, సినిమాటిక్ విజువల్ స్టూడియో
నటీనటులు : కార్తీక్ శివన్, గీతికా రథన్, కిట్టయ్య, రూపేష్, సూరజ్, పటాస్ రామ్, ప్రసాద్ తదితరులు
రచన- దర్శకత్వం : ఎస్ ఎన్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాత : సిరివిరెడ్డి నరసింహారెడ్డి, ఎడమ శ్రీను
ఎడిటర్ : కోడటి పవన్ కళ్యాణ్
డి ఓ పి: గుణశేఖర్
సంగీతం : శరవణ వాసుదేవన్
ఆర్ట్ : గిరి
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎడమ కృష్ణ
ఫైట్స్ : శంకర్
కోరియోగ్రాఫర్ : మురళి
కాస్ట్యూమ్స్ : శివ
గ్రాఫిక్స్ : సినిమాటిక్ విజువల్ స్టూడియో
పి ఆర్ ఓ : హరీష్ అప్పరాల

Previous Post

‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

Next Post

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

Next Post
ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి “మేకింగ్ ఆఫ్ విశ్వ” గ్లిమ్స్ విడుదల

ది బ్రేకింగ్ న్యూస్ మూవీ నుంచి "మేకింగ్ ఆఫ్ విశ్వ" గ్లిమ్స్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In