జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యబద్దంగా కౌలు రైతులకు అండగా నిలుస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి , ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నందుకు జనసేన పార్టీకి ప్రజల్లో నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే YCP ఎమ్మెల్యేలు , మంత్రులు దిగజారి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కళ్యాణ్ ని విమర్శించే ముందు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను విమర్శించే నైతిక హక్కు లేదు అని తుమ్మల రామస్వామి బాబు – పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి అన్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల గురించి డిజిటల్ క్యాంపెయిన్ చేపడితే ఆ రోడ్లను జనసైనికులే మరమ్మత్తు చేసేయొచ్చుగా అంటూ అధికారంలో ఉన్న నాయకులు వ్యంగ్యంగా మాట్లాడ్డం చూస్తుంటే కనీసం రోడ్లని కూడ వెయ్యలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందేమో అన్న అనుమానం కూడా మాకు వ్యక్తమవుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ను విమర్శించడంలో పెట్టిన శ్రద్ధ రాష్ట్రానికి పరిశ్రమలు , నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు తీసుకుని రావడానికి పెడితే బాగుంటుంది అని తెలియజేస్తున్నాను.