• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

గుంపుగా వచ్చినా… సింగిల్‌గా వచ్చినా

admin by admin
July 14, 2023
in politics
0 0
0
గుంపుగా వచ్చినా… సింగిల్‌గా వచ్చినా
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వర్షాకాలం రోజురోజుకూ వరదనీరు పెరుగుతున్నట్లు .. నదుల్లో నీటిమట్టం పెరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ఓటు మట్టం పెరుగుతోంది.. ఎవరు ఎన్నిరకాలుగా గ్రూపులు కట్టినా .. కూటములు కట్టినా ఈసారి కూడా జగన్‌ని నిలువరించడం కష్టమే అని ఇంకో సర్వే తేల్చింది. ఈమధ్య నేషనల్ మీడియా టైమ్స్ నౌ – నవ భారత్ చేసిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదని తేల్చేసింది. ఇక ఇప్పుడు పోల్ స్ట్రాటజీ అనే సంస్థ చేపట్టిన సర్వేలో సైతం మళ్ళీ అదే ఫలితం వచ్చింది. అవును పంచదార ఎంతమంది చూసినా తియ్యగానే ఉంటుంది ఒక్క షుగర్ వ్యాధి ఉన్నారు రోగి తప్ప.

పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. తెలుగుదేశం, జనసేన కలిసివెళ్లినా ? విడివిడిగా వెళ్లినా గెలుపు జగన్ వైపే ఉంటుందని ఆ సర్వే తేల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని టిడిపి జనసేన కలిసి వెళ్తే వారికి 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే చెబుతోంది. ఇతరులకు పదిశాతం ఓట్లు వస్తాయి. ఇక సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే ప్రశ్నకు 56 శాతం మంది జగన్ కు ఓటేయగా , చంద్రబాబుకు 37 శాతం మంది జైకొట్టారు. పవన్‌ను కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంచుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనా బాగుందని 56 శాతం మంది చెప్పగా 22 శాతం మంది బాలేదని అన్నారు. 9 శాతం మంది చాలా బాగుందని చెప్పగా 8 శాతం మంది అసలు బాలేదని అన్నారు. మూడు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేక న్యూట్రల్ గా ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? 2019తో పోలిస్తే వైయస్‌ఆర్‌సీపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.

సంక్షేమ, అభివృద్ధి పథకాలే ప్రాణం

సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాలూ.. చిన్నచిన్న వాడల్లోకి సైతం చేరిపోగా ప్రజలంతా జగన్ కుటుంబంలో భాగమయ్యారు.. ప్రజలు సైతం ఈయన్ను తమ కుటుంబ సభ్యడిలా భావిస్తున్నారు. దీంతో పథకాలు పొందిన లబ్ధిదారులు మొత్తం గంపగుత్తగా జగన్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికితోడు నాడు – నేడు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్య వైద్య రంగాల్లో సాధించిన గణనీయమైన మార్పులు జగన్ పాలనా దక్షతకు అద్దం పడుతున్నాయని ఓటర్లు భావిస్తున్నారు ఇక చంద్రబాబు కూడా అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. అంటూ ఏవేవో చెప్పినా ప్రజలు ఆయన్ను నమ్మడం లేదు.. అయన గత చరిత్ర తెలిసినవాళ్ళు చంద్రబాబును ఓ అవకాశవాదిగా మాత్రమే చూస్తారు తప్ప ఆయన్ను నమ్మదగిన నాయకుడిగా చూడలేరు. అందుకే మొన్న మహానాడులో చంద్రబాబు ఇచ్చిన హామీల టీజర్ ఫెయిల్ అయింది. దానికితోడు గతంలో చాలా హామీలు ఇచ్చి మరిచిన ఆయన్ను మళ్ళీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

టిడిపికి పొత్తులే ప్రాణం

తెలుగు దేశం పార్టీ పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర లేనందున ఈసారి జగన్‌ను ఎదుర్కొనేందుకు పొత్తులకోసం ప్రయత్నిస్తోంది. అటు బిజెపి.. జనసేనలో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. అది సరిగ్గా పొసగడం లేదు.. పవన్ వాగుడు చూస్తే చంద్రబాబుకె భయం వేస్తోంది. ఈయనతో వెళితే మొత్తాన్ని ముంచేసేలా ఉన్నాడు అనే సంశయం మొదలైంది. అలాగని పొత్తులేకుండా వెళితే ఓటమి కన్ఫామ్ అయినట్టే. ఇక బిజెపికి సైతం రాష్ట్రాల్లో ఎదురుదెబ్బలు తప్పేలా లేదు.. దీంతో బిజెపితో వెళ్లాలా వద్దా? వెళ్తే ఏమవుతుందో అనే భయం వెంటాడుతోంది. ఇక ఇటు పవన్ కళ్యాణ్ సైతం ఒక దిశా నిర్దేశం లేని మార్గంలో పయనిస్తూ తనకుతానే దారితప్పిపోతున్నారు. ఇక జగన్ మాత్రం ఎవర్నీ నమ్ముకోకుండా అచ్చం ప్రజలతో మాత్రమే మా పొత్తు. మీ ఇంట్లో మేలు జరిగితే.. మీకు మంచి జరిగితే మీ బిడ్డను ఆశీర్వదించండి అనే కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్తున్నారు. ఇవన్నీ గ్రహించిన ప్రజలు జగన్‌కు మరోమారు పట్టంగట్టే అవకాశాలు ఉన్నాయని ఆ సర్వే చెబుతోంది.

Previous Post

శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ నుంచి బ్లాస్టింగ్ ‘బిగ్ డాడీ’ టీజర్ విడుదల

Next Post

మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా… సినిమా వైపు

Next Post
మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా… సినిమా వైపు

మెగాస్టార్ చిరంజీవి ఆదర్శంగా... సినిమా వైపు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
movies

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

by admin
May 25, 2026
0

...

Read more
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In