• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

కాంట్రాక్టర్లకు పనులు… చంద్రబాబుకు ముడుపులు

admin by admin
September 1, 2023
in politics
0 0
0
కాంట్రాక్టర్లకు పనులు… చంద్రబాబుకు ముడుపులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

* పీఏ ద్వారా రూ.118 కోట్లు నొక్కేసిన చంద్రబాబు

* ఇప్పటికే గుర్తించిన ఐటి విభాగం … నోటీసులు జారీ

రోజూ వ్రతాలు చేసే మహాతల్లి పోలీస్ రైడింగ్ లో దొరికినట్లు అయింది. టాప్ ర్యాంకర్ కాస్తా మాస్ కాపీయిం‌గ్‌కు పాల్పడి స్క్వాడ్‌కు దొరికిపోయి డీబార్ అయినట్లు అయింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టినవాడు డోపింగ్ టెస్టులో దొరికినట్లు … ఇప్పుడు చంద్రబాబు నిజాయితీ సైతం నేతిబీర చందమే అని మరోసారి అర్థం అయింది.

చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకుంటూ కమీషన్లు మింగుతున్నారు అని ఏనాడో మోడీ ఆంధ్రప్రదేశ్‌లో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. అదే మరోమారు రుజువైంది. చంద్రబాబు రాత్రిపూట టార్చ్ లైటు పట్టుకుని ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాంట్రాక్టర్లను కమీషన్ల కోసం వేధించేవాడు అంటూ దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పినమాట మరోమారు రుజువైంది. ఏయ్.. నేను నిప్పును.. ఇప్పటికీ నా మీద ఒక్క ఆరోపణ లేదు.. ఎక్కడా రూపాయి అవినీతి లేదు.. నన్ను ప్రశ్నించే చట్టాలే పుట్టలేదు. నన్ను ఎక్కడ ఎవరూ పట్టుకోలేరు అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారు.

*ప్రాజెక్టులు ఇవ్వడం .. కమీషన్లు మింగడం*

చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో చేసింది ఒక్కటే. తనకు నచ్చిన వాళ్లకు.. అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు, పనులు ఇవ్వడం.. దానికి ప్రతిఫలంగా వారినుంచి వందలు.. వేల కోట్లలో కమీషన్లు నొక్కడం.. ఇదే అయన టెక్నిక్.. గతంలో అధికారంలో ఉన్నపుడు కూడా ఇలాగే జరిగింది. అమరావతి కాంట్రాక్టర్‌లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్పిసిఎల్), ఎల్&టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయి. ఈ విషయాలు ఐటి సంస్థల సోదాల్లో గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్టజెప్పినట్లు షాపూర్జి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో ఐటి శాఖ గుర్తించింది.

*ఏమి జరిగింది? ఎలా జరిగింది?*

అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారు. దాంతో మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అందులో తన కమీషన్లు వసూలు చేసేందుకు బాబు.. శ్రీనివాస్ ను రంగంలోకి దింపారు. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్క శ్రీనివాస్ అటాచ్ చేశారు. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మనోజ్తో చెప్పారు.

బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారు. ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడింది. ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఐటి అధికారుల ముందు కూడా అంగీకరించారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగష్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించింది. దీంతో తన బండారం బయటపడుతుందని భయపడిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకుని ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Tags: IT department serves show - cause notice to Chandrababu Naidu
Previous Post

అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

Next Post

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో…

Next Post
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో…

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యంగ్ హీరో...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In