• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌

admin by admin
September 26, 2022
in movies
0 0
0
ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా “గణా” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌

రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై `దుర్మార్గుడు` ఫేమ్ విజ‌య్ కృష్ణ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం `గ‌ణా`. సుక‌న్య‌, తేజు హీరోయిన్స్ గా న‌టించారు. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎస్వీ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ..’నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా..ఇప్పుడు అక్కడి నుంచే మరో వ్యక్తి అతను పేరు కూడా క్రిష్ణారెడ్డే..కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి అనే ఒక వ్యక్తి కృషి తో, పట్టుదలతో, దీక్ష‌తో గ‌ణా చిత్రాన్ని రూపొందించారు. విజయ్ క్రిష్ణ హీరోగా న‌టిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని తీశారు. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయ‌డ‌మంటూ మామూలు విష‌యం కాదు. దీనికి ఎంతో సహకారం ఉండాలి..ఎంతో మంది వ్యక్తులు ఇతనికి సహకరించడం వలన సాధ్యపడుతుంది. సినిమా అంటే మాటలు కాదు కదా..కాబట్టి అందరి సహకారంతో ఇతను ఈ సినిమాని నిర్మించగలిగారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్యా
శేషారెడ్డిగారు, ఫారిన్ నుండి ఎమ్.యు.ఎస్ రెడ్డిగారు, కాకినాడ కార్పొరేటర్ బాల ప్రసాద్ గారు, కర్రి బుచ్చిరెడ్డిగారు ఇలా అందరూ కలిసి ఒక మంచి సినిమా తియ్యాలనే తపనతో మన ముందుకొచ్చారు. నా చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా“ అన్నారు.
హీరో విజయ్ క్రిష్ణ మాట్లాడుతూ..’ దుర్మార్గుడు మూవీతో న‌న్నుహీరోగా వంశీగారు పరిచయం చేశారు.
ప్రతీ వ్యక్తికీ ఒక ఆదర్శం ఉంటుంది. మాకు అన్నగారు ఎస్వీ క్రిష్ణారెడ్డిగారు ఆదర్శం. ‘గణా’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు సార్ కి నేనెప్పుడూ రుణపడి ఉంటాను..నా ధన్యవాదాలు
తెలుపుకుంటున్నాను..నేను ఇది వరకు దుర్మార్గుడు, గోవిందా భజ గోవింద సినమాల్లో ప్రధాన పాత్రలో చేశాను. పాగల్ వంటి పలు చిత్రాల్లో విలన్ గా కూడా చేశాను. హీరోగా మూడో సినిమా గణా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను తొలిసారిగా ఈ గణా చిత్రానికి డైరెక్టర్ గా చేశాను..ఈ సినిమాని నేను ఒక యజ్ఞంలా ప్రారంభించాను.. నా సొంత బ్యానర్ ఎస్.కె.ఆర్ట్స్ లో తొలిసారిగా నిర్మించాను..ఈ సినిమా నిర్మాణంలో సహాయం చేసిన వారందరికీ నా ధన్యవాదాలు.. త్వరలో మా ఎస్.కె ఆర్ట్స్ బేన‌ర్ లో ఈ సినిమా తర్వాత మా డైరెక్షన్ టీం నుండి కొత్త ప్రాజెక్ట్ చేయ‌డానికి సన్నద్ధం అవుతున్నాము’ అని తెలిపారు..

కో -డైరెక్టర్ పృథ్వీ మాట్లాడుతూ..’ఈ మూవీకి నేను కో డెరెక్టర్ గా చేశాను. ముందుగా మా గణా మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసిన మన తెలుగు చిత్రసీమ సీనియర్ దర్శకులు ఎస్వీ క్రిష్ణా రెడ్డిగారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విజ‌య్ కృష్ణ గారు అన్నీ తానై ఈ సినిమా చేశారు“ అన్నారు.

డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి శివక్రిష్ణ మాట్లాడుతూ..“నాకీ సినిమాలో అవాకశమిచ్చిన హీరో
డైరెక్టర్ ప్రొడ్యూసర్ విజయ్ క్రిష్ణగారికి నేను చాలా రుణపడి ఉంటాను. గణా సినిమా ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైన్ ఫిలిం. ఈ చిత్రం ఆద్యంతం బోర్ కొట్టకుండా చాలా స్పీడ్ స్క్రీన్ ప్లేతో పరిగెడుతుంది. సాంగ్స్, ఫైట్స్, కామెడీ ఇలా అంతా నవరసభరితంగా ఉంటుంది“ అన్నారు.
సినీ దర్శకుడు రామారెడ్డి పసలపూడి మాట్లాడుతూ..’గణా సినిమా ఒక పెద్ద హీరో తీయాల్సిన సినిమా..ఒక ప్రభాస్ గారు, ఒక మహేష్బా బుగారు లాంటివాళ్లు చేయాల్సిన సినిమా విజయ్ క్రిష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు .ప్రేక్షకులు ఈ సినిమా ఆద‌రిస్తారని కోరుకుంటున్నాను“ అన్నారు.
బాక్సాఫీస్ రమేష్ చందు మాట్లాడుతూ..’విజయ్ క్రిష్ణగారి ‘గణా’ సినిమా పోస్టర్ చాలా బాగుందని, సినిమా కూడా ఇంకా బాగుంటుందినీ, త్వరలో రిలీజ్ కాబోతున్న ‘గణా’ సినిమా ఘనవిజయం సాధించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

హీరోగా విజయ్ క్రిష్ణ, హీరోయిన్లుగా సుకన్య, తేజు నటించారు. నాగ మహేష్, ప్రభు, ఛత్రపతి ఫేమ్ జ‌గ‌దీష్ , దత్తు విలన్లుగా చేశారు. సీనియర్ నటుడు హేమ సుందర్, జబర్దస్త్ అప్పారావు, దొరబాబులు ముఖ్య పాత్రల్లో నటించారు.
కాగా ఈ చిత్రానికి ఎడిటర్ గా నందమూరి హరి-ఎన్టీఆర్, డీఓపి గా సన్ని చేశారు. చిన్నిక్రిష్ణ సంగీతాన్ని అందించారు. స్టంట్స్ శివరాజ్ మాస్టర్..కో డైరెక్టర్ పృథ్వీ.. చీఫ్ అసియేట్ డైరెక్టర్ దేవర శివక్రిష్ణ .. కొరుమిల్లి. లైన్ ప్రొడ్యూస‌ర్స్ గా బాల ప్రసాద్, ఎమ్.యు.ఎస్.రెడ్డి, కర్రి బుచ్చిరెడ్డి, పిఆర్ఓ. చందు రమేష్.

Previous Post

“ఉర్వశివో రాక్షసివో” పోస్టర్ కి అనూహ్య స్పందన

Next Post

కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘శబరి’

Next Post
కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘శబరి’

కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'శబరి'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’
movies

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

by admin
September 16, 2026
0

...

Read more
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In