• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఏపీ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్రం నిర్ణయాలు: చంద్రబాబు

admin by admin
August 28, 2024
in politics
0 0
0
పరిశ్రమల శాఖ అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్ష
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమరావతి: పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసింది. కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ ఏర్పాటు చేశారు. పోలవరం విషయంలో ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు. పోలవరానికి కేంద్రం పెండింగ్‌ నిధులు ఇవ్వాలి. కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదు.

కొత్త డయాఫ్రమ్‌ వాల్‌నిర్మిస్తాం..
2019లో పోలవరం ప్రాజెక్టుకు శనిగ్రహం ఆవరించింది. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పోలవరం పనులకు గ్రహణం పట్టింది. 2021 నాటికి పోలవరం పూర్తి చేసి ఉండాలి. వైకాపా హయాంలో కేంద్రం రూ.8వేల కోట్లు ఇచ్చింది, పీపీపీ లేఖ కూడా రాసింది. ఐదేళ్లుగా పురుషోత్తమపట్నం, పట్టిసీమను ఉపయోగించుకోలేదు. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి మళ్లీ పోలవరాన్ని ట్రాక్‌లో పెట్టగలిగాం. ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగింది. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యావాదాలు. పోలవరం చాలా సున్నితమైన ప్రాజెక్టు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గోదాట్లో మునిగిన పోలవరం ఇప్పుడు మళ్ళీ గట్టెక్కింది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే మేలని నిపుణులు తేల్చారు. రూ.992 కోట్లతో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తాం. 41.15 మీటర్ల ఎత్తుతో మొదటి దశ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం.

ఏపీలో మూడు కారిడార్‌లు..

దేశంలో మొత్తం 12 పారిశ్రామిక కారిడార్‌లు నిర్మిస్తుంటే ఏపీలో మూడు కారిడార్‌లు ఉన్నాయి. వీటిపై మొత్తం రూ.28వేల కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. కడప జిల్లా కొప్పర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్‌లు వస్తున్నాయి. కృష్ణపట్నానికి కూడా అనుమతిచ్చారు. నక్కపల్లికి ఫార్మా క్లస్టర్‌ కూడా వస్తోంది. ఇవన్నీ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కారణమవుతాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రానికి మంచి రోజు’’ అని చంద్రబాబు అన్నారు.

Previous Post

“కానిస్టేబుల్” మోషన్ పోస్టర్ విడుదల

Next Post

యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ ఫస్ట్ లుక్ రిలీజ్

Next Post
యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ ఫస్ట్ లుక్ రిలీజ్

యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..
politics

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాల ఆగ్రహం..

by admin
April 14, 2026
0

...

Read more
సెన్సార్ కార్యక్రమాల్లో  “ఆర్ కే దీక్ష”

సెన్సార్ కార్యక్రమాల్లో “ఆర్ కే దీక్ష”

April 13, 2026
క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

క్షీణిస్తున్న బోడె రామచంద్ర యాదవ్ ఆరోగ్యం

April 13, 2026
శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

April 11, 2026
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In