BNK ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ప్రొడక్షన్ నెం1గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం గురువారం ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. మనోజ్ ఎల్లుమహంతి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంతో ప్రదీప్ విరాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. ఆయన సరసన దివ్య ఖుష్వా హీరోయిన్‌గా నటించనుంది. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బిఎన్‌కె (బంగారు నవీన్ కుమార్) భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలలో ముహుర్తపు సన్నివేశానికి సక్సెస్‌ఫుల్ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ కొట్టగా.. సీనియర్ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బిజినెస్‌మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్‌ని చిత్రయూనిట్‌కు అందించారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత BNK మాట్లాడుతూ.. ముందుగా మా తొలి ప్రయత్నానికి సహకరించడానికి వచ్చిన వి. సముద్రగారికి, రాహుల్ యాదవ్‌గారికి, రామ్‌గారికి.. ఇతర అతిథులందరికీ ధన్యవాదాలు. దర్శకుడు మనోజ్ చెప్పిన మంచి కథతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కథ చెప్పిన విధానం ఎంతగానో నచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. అందుకే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా నిర్మించనున్నాం. మంచి ‘క్యాస్ట్ అండ్ క్రూ’ని దర్శకుడు సెలక్ట్ చేస్తున్నారు. తప్పకుండా మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ మొట్టమొదటి చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నామని అన్నారు.
దర్శకుడు మనోజ్ మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రతీ సీన్ ఉత్కంఠతను కలిగించేలా ఈ సినిమా ఉంటుంది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత బిఎన్‌కెగారికి ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఈ సినిమాతో ప్రదీప్ విరాజ్ అనే ఒక చలాకీ కుర్రాడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అలాగే ఈ పూజా కార్యక్రమానికి అతిథులుగా వచ్చి ఆశీర్వదించిన పెద్దలందరికీ మా టీమ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అని తెలిపారు.
ప్రదీప్ విరాజ్, దివ్య ఖుష్వా హీరోహీరోయిన్లుగా నటించిన
బ్యానర్: BNK ఎంటర్‌టైన్‌మెంట్స్
సినిమాటోగ్రఫీ: పంకజ్ తట్టోడ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రసన్న ఆంజనేయులు
పీఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: BNK (బంగారు నవీన్ కుమార్)
స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మనోజ్ ఎల్లుమహంతి
BNK Entertainments Production No 1 Movie Launched In A Grand Manner
Production No 1 in BNK Entertainments banner is launched with Pooja ceremony in a grand manner amidst celebrities from the industry. Manoj Yellumahanthi directorial marks the debut of Pradeep Viraj as Hero to the film industry while Divya Khushwa is playing as female lead. The film touted to be a love and crime thriller is being mounted on a large scale by BNK (Bangaru Naveen Kumar). In the Pooja Ceremony which took place at Hyderabad, Popular producer Rahul Yadav Nakka has provided the first clap while senior director V Samudra has switched on the camera. Businessman Ram Yerram handed over the script to the team.
The film will commence it’s regular shoot very soon. Producer BNK says, ” First of all, Thanks to Samudra garu, Rahul Yadav garu, Ram garu and all our guests who came here today to bless our first attempt. I am glad to introduce as a producer to the film industry with a good script narrated by Manoj. I liked the way he narrated the story to me. The subject comprises all commercial elements. Thus we are making the film in an uncompromising manner with big budget. Director has selected efficient cast and crew. I am confident that this film which is coming as the first movie from our banner will become a huge success. ”
Director Manoj says, ” The film which has a crime thriller background will have every scene in a very interesting manner. Thanks to producer BNK garu for believing me and giving me this opportunity. I will surely deliver and live up to his expectations. I am introducing an energetic youngster Pradeep Viraj as a Hero to the industry. Thanks to everyone who are supporting me. I thank each and everyone who came here today to bless us on behalf of my entire team. We will reveal more details about the film very soon. ”
Cast:
Pradeep Viraj, Divya Khushwa
Banner: BNK Entertainments
Cinematography: Pankaj Tattoda
Executive Producer: Prasanna Anjaneyulu
PRO: B. VeeraBabu
Producer: BNK (Bangaru Naveen Kumar)
Story, Screenplay, Dialogues, Direction: Manoj Yellumahanthi