• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

చక్ర వ్యూహం… ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్

admin by admin
June 2, 2023
in movies, reviews
0 0
0
చక్ర వ్యూహం… ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అజయ్ ఎంచుకునే పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి. విలన్ పాత్ర వేసినా.. హీరోగా చేసినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినా… ఆయా పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తారు. తాజాగా అజయ్ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌ ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకత్వంలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రి నిర్మించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అజయ్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించారు. మాస్ కమర్షియల్ సినిమాలను తీసే మైత్రి మూవీస్ వారు ఈ సినిమా ను తమ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడంతో ఈ “చక్రవ్యూహం”పై మరింత ఇంట్రెస్ట్ కలిగింది. మరి ఈ మర్డర్ మిస్టరీ ఆడియెన్స్ ను ఎలా థ్రిల్ కు గురిచేసిందో చుద్దాం పదండి.

కథ : వివేక్ (సంజయ్), ఊర్వశి పరదేశి (సిరి). వీరిద్దరూ ఒకర్ని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న జంట. ఎంతో అన్యోన్యంగా, హ్యాపీగా సాగుతున్న వీరి జీవితంలో ఎవరూ ఊహించని విధంగా సిరి హత్య గావించబడుతుంది. ఆ తరువాత ఆమెకు సంబంధించిన వారందరూ వరుసగా హత్యలకు గురవుతుంటారు. ఇలా ఎన్నో ట్విస్ట్ ల మధ్య ఆసక్తికరమైన పరిస్థితుల్లో ఎవరు ఎవరిని ఎందుకు చంపారో అర్థం కాకుండా ఉంటుంది. సస్పెన్స్ ప్రధానంగా సాగే ఈ కథలో సంజయ్ స్నేహితుడు సుదేశ్ (శరత్) పాత్రేమిటి? అతను ఎందుకు హత్య గావించబడ్డాడు? అలాగే సంజయ్ దగ్గర పని చేస్తున్న మేనేజర్ మరియు సంజయ్ ను ఇష్టపడ్డ ప్రగ్య నయన్ ( శిల్ప) పాత్రలేమిటి? ఈ హత్యలవెనుక ఉన్న అసలు మర్మాన్ని పోలీసులు ఎలా ఛేదించారనేదే తెలుసుకోవాలంటే ‘చక్ర వ్యూహ్యం’ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ….

మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో… థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి… సినిమాని తీయగలిగితే… ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అవుతారు. ఇలాంటి స్టోరీ నే ఎంచుకుని తెరకెక్కించాడు చక్రవ్యూహం డైరెక్టర్ మధు సూదన్. ఇలాంటి కథలతో ఆడియెన్స్ ను థ్రిల్లింగ్ కు గురిచేయాలనే ఉద్దేశంతో నిర్మాత సావిత్రి కూడా ఈ చిత్రాన్ని ఎంచుకోవడం… ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఓ సస్పెన్స్ మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ… కథనం ఆడియెన్స్ ని ఎంతో థ్రిల్ కి గురి చేస్తుంది. ఒకరి తరువాత ఒకరు మర్డర్ కావడం… దాని వెనక వున్న వ్యక్తులను చేదించే వ్యూహం… అన్నీ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తాయి.

నటీనటుల నటన ఎలా వుంది…

సంజయ్ పాత్రలో నటించిన వివేక్ ఇటు భర్త గా, ఇటు సైకో గా తన హావ భావాలతో మెచ్యూర్డ్ నటన కనబరిచాడు. పాత్రలో పరకాయప్రవేశం చేసాడని చెప్పొచ్చు. ప్రతీ ఫ్రేమ్ లోనూ మెరుగైన నటనను ప్రదర్శించాడు.సంజయ్ భార్య గా నటించిన సిరి పాత్రలో ఊర్వశి పరదేశి తన పాత్రలో ఒదిగిపోయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పాత్రలో సత్య గా నటించిన అజయ్ నటన ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచింది. అతడి సహ పోలీస్ పాత్రలో నటించిన దుర్గ (జ్ఞానేశ్వరి) కూడా చక్కగా నటించింది. హీరో ఫ్రెండ్స్ గా నటించిన రాజ్ తిరందసు (రవి), కిరీటి తో పాటు, హీరోయిన్ కు తల్లిగా నటించిన ప్రియ, తండ్రులుగా నటించిన రాజీవ్ కనకాల ( శ్రీధర్ ), శ్రీకాంత్ అయ్యాంగార్ ( శ్రీనివాస్ ), హీరోయిన్ తాతగా నటించిన శుభలేఖ సుధాకర్ ( జగన్నాధం ) పాత్రలు చిన్నవే అయినా.. ఉన్నంతలో ఆయా పాత్రల పరిధిమేరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు …

డైరెక్టర్ మధుసూధన్ కిది తొలి సినిమా అయినప్పటికీ ఆద్యంతం ప్రేక్షకులు సస్పెన్స్ కు గురయ్యేలా చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన తీరు ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. అనుక్షణం ప్రతి సన్నివేశంలోను ఆ సస్పెన్స్ ను అలాగే కొనసాగించి దర్శకుడిగా మంచి ప్రతిభను కనపరచాడు. కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. జి. వి అజయ్ కెమెరా పనితనం మెచ్చుకోవాలి. సస్పెన్స్ తో సాగే ప్రతి సన్నివేశాన్ని తన కెమెరాలో చక్కగా బంధించి తన కెమెరా పనితనాన్ని చాటారు. జెస్విన్ ప్రభు ఎడిటింగ్ పనితీరు ఓకే. భరత్ మంచిరాజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బేబీ అన్వి సమర్పణలో సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత సావిత్రి నిర్మించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టు ఉండి సినిమాపై వారికున్న టేస్ట్ ను తెలిపింది. మొత్తంగా చూస్తే సస్పెన్స్ తో సాగే ఉత్కంఠ భరితమైన కథనాన్ని ప్రేక్షకులు మెచ్చేలా తీర్చి దిద్దిన వైనం స్పష్టంగా కనిపించింది. సినిమా చూసే ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. చక్ర వ్యూహం… ఎంగేజింగ్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్… గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3

Tags: AjayChakravyuhamChakravyuham Movie ReviewMurder Mystery Thriller
Previous Post

అగ్రగామి ఛానెల్ గా… NTV

Next Post

గ్రాండ్‌గా BNK ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం

Next Post
గ్రాండ్‌గా BNK ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం

గ్రాండ్‌గా BNK ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం1 చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి
movies

శ్రీకాకుళంలో గోయాజ్ 25వ స్టోర్ ను ప్రారంభించిన హీరోయిన్ నేహా శెట్టి

by admin
April 11, 2026
0

...

Read more
మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

మంగళగిరిలో ‘ధర్మ దీక్ష’: బీసీల హక్కుల కోసం బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష!

April 11, 2026
ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగ “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

April 11, 2026
రివ్యూ- డీకాట్ (Dacoit)

రివ్యూ- డీకాట్ (Dacoit)

April 10, 2026
ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

April 7, 2026
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In