పెద్ద హీరో సినిమాకు వద్దు అన్నా పబ్లిసిటీ దొరుకుతుంది. చిన్న సినిమాని పట్టించుకునే వాడే ఉండడు. అలాంటప్పుడు కేవలం సినిమాలో కంటెంటే నిలబెట్టాలి. అయితే మా సినిమాలో కంటెంట్ ఉందని తెలియాలంటే ముందు ఆ కంటెంట్ ని రిప్రజెంట్ చేసే ట్రైలర్స్,టీజర్స్ అదిరిపోయేలా వదలాలి. డైరక్టర్ టాలెంట్ సినిమా తీయటం కన్నా ఇలాంటి వాటిపైనే ఉండాల్సిన పరిస్దితి. ఇలాంటి పరిస్దితుల్లో ఈ మధ్య కాలంలో సినిమాపై కావల్సినంత బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్ తో ముందుకు వచ్చిందీ చిత్రం. కొత్త తరహా లో చేసిన ప్రమోషన్స్ సినిమాపై హైప్ ని పెంచడంతో అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అయితే ఆ ఆసక్తి సినిమాలో కొనసాగిందా? తంత్ర లోని ఎపిసోడ్స్ ప్రేక్షకులని అలరించాయా ?
స్టోరీ లైన్
ఈ సినిమా కథ ఆరు(రక్తదాహం, పాతాళకుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, ఛిన్నామస్తా దేవి) విభాగాలుగా సాగుతుంది. ఓ పల్లెటూరి అమ్మాయి రేఖ (అనన్య) ఈ ఎపిసోడ్స్ అన్నిటికీ కీ రోల్. రేఖ కు నుంచి కొన్ని శక్తులు,ఆత్మలు కనపడుతూంటాయి. దాంతో ఆమె వాటికి భయపడి రాత్రిళ్లు బయిటకు వెళ్లాటానికి జంకుతుంటూంది. కాలేజీకు వెళ్లి వచ్చేసి ప్రశాంతంగా ఉందామనుకుంటే ఆమెను కొన్ని తాంత్రిక శక్తులు వెంబడిస్తూ వేధిస్తూంటాయి. ఇదంతా గమనిస్తున్న తేజా (ధనుష్ రఘుముద్రి) గమనిస్తూంటాడు. తేజా కు ఆమె అంటే ఇష్టం. ఈమె ప్రవర్తన చూసి ఆమెకు ఎవరైనా చేతబడి చేసారేమో అని భావిస్తాడు. ఈ లోగా ఆ ఊళ్లోకి ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్లిపోయిన విగతి (టెంపర్ వంశీ) ఎంట్రి ఇస్తాడు. అతను వచ్చి రేఖను తన కూతురే అని చెప్తూంటాడు. అసలు రేఖ నేపధ్యం ఏమిటి..ఆమెకు ఎందుకు ఆత్మలు,శక్తులు ఎందుకు కనపడుతున్నాయి.అలాగే ఆమె తల్లి రాజేశ్వరి (సలోని)కు ఏమైంది..ఆమె ప్లాష్ బ్యాక్ ఏమిటి… రేఖకు నిజంగానే చేతబడి జరిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ
ఒకే కథను థ్రిల్లర్, హారర్, ఎమోషనల్… ఇలా చాలా యాంగిల్స్ లో చూపించే ప్రయత్నం చేయటమే స్క్రీన్ ప్లే పరంగా చాలా క్లిష్టమైనదే..సాహమే. సీనియర్ డైరక్టర్స్ అందుకే తక్కువ పాత్రలు..తక్కువ కోణాలు అన్నట్లుగా కథలు రాసుకుని తెరెకెక్కిస్తూంటారు. కానీ కొత్త దర్శకుడు తను రీసెర్చ్ చేసి తెలుసుకున్నది మొత్తం తెరమీద చూపించాలనే తాపత్రయం చూసేవాళ్లకు సమస్యగా మారింది. అయితే అదే కొత్త ఎక్సపీరియన్స్ ఇచ్చింది. లేకపోతే పాత రొట్ట సీన్స్ తో సాగే సినిమా చూస్తున్న పీల్ వచ్చేది. సెకండాఫ్ వచ్చే ప్లాష్ బ్యాక్ ,క్లైమాక్స్ ఈ దర్శకుడు దగ్గర ఉన్నట్లుంది. దాని చుట్టూ మిగతా సీన్స్ అల్లినట్లున్నారు. దాంతో సెకండాఫ్ లో ఉన్న బిగి ఫస్టాఫ్ లో కొరవడింది. దానిపై సరైన కసరత్తు చేయలేదు. హీరో పాత్ర నామ మామత్రమై పోయింది. తెరపై ఆ పాత్ర ఏమి చెయ్యదు. అలాగే కీలకమైన హీరోయిన్ పాత్ర ని తప్పించి మిగతావాళ్లని పట్టించుకోలేదనిపించింది. అలాగే ఆ పాత్రని సస్పెన్స్ థ్రిల్లర్ కి జోడించడంలో మరింత నేర్పు చూపించాల్సింది. బడ్జెట్ లిమిటేషన్ కూడా ఉండేసరికి.. కథకు తగ్గ సరైన న్యాయం చేయలేదేమో అనిపిస్తోంది. దర్శకుడి పనితనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాంకేతిక నిపుణుల నైపుణ్యం దర్శనమిచ్చి మైమరిపిస్తుంది. దర్శకుడి ప్రయత్నం చివరి ఇరవై నిముషాలు కుదిరినంతగా సినిమా మొత్తం కుదరలేదనే చెప్పాలి.అలాగే సినిమాలో చాలా విషయాల్లో కావాల్సిన దానికంటే ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో అసలు కథే ముందుకు వెళ్ళకపోవటమనే స్క్రీన్ ప్లే సమస్యే. అటువంటి ప్రదేశాల్లో అటు కెమెరామెన్ ఇటు మ్యూజిక్ డైరెక్టర్… ఇద్దరూ పోటీపడి ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించారు. ఇంటర్వెల్ కు వచ్చేసరికి పూర్తిగా కథలోకి వచ్చి కథనం పరుగెట్టించగలిగాడు.
టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమా కథను రెగ్యులర్ హారర్ ఎలిమెంట్స్ కాకుండా కొత్తగా ట్రై చేయటం నచ్చుతుంది. ముఖ్యంగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే వజ్రోలి రథి ఎపిసోడ్‌ను టెంపర్ వంశీ, సలోని మీద తీసిన తీరు ఆడియన్స్‌ను బాగా నచ్చుతుంది. అయితే రొమాంటిక్ సీన్స్ తో పాటు కొన్ని ఎపిసోడ్స్ సాగతీతలా ఉండటంతో అక్కడక్కడ సినిమా స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే క్లైమాక్స్ లో కంటెంట్ ఉన్నా అందుకు తగ్గట్లు హై రప్పించలేకపోయారనిపిస్తుంది. డైరక్టర్ తనే రచయిత కావటంతో కొన్ని చోట్ల రైటర్ ఎక్కువ డామినేట్ చేసారు. అయితే డైరక్టర్ గానూ తన పనితనం చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా వర్క్ సైతం విలేజ్ ఎట్మాస్మియర్ ని బాగా పట్టుకుంది. ఎడిటింగ్ లో ల్యాగ్ లు తగ్గిస్తే బాగుండేది.
నటీనటుల్లో ..అనన్య నాగళ్ల సినిమా మొత్తం తనే మోసింది. అప్పుడే ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లోకి వచ్చిందనుకున్నా… సమర్దవంతంగా చేసింది. ధనుష్ రఘుముద్రి కూడా మొదటి సినిమానే అయినా బాగా చేసారు.
చూడచ్చా
హారర్ చిత్రాలు అన్ని ఒకేలా ఉండాలని రూల్ లేదు అనే విషయం చెప్పటానికి తీసిన సినిమాలా ఉంది. వీకెండ్ కు మంచి కాలక్షేపమే.
Rating: 3
బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
నటీనటులు: అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల, భువన్ సాలూరు తదితరులు
సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల
ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ
ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్
మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్
సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా
సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్
VFX: ఎ నవీన్
DI కలరిస్ట్: పివిబి భూషణ్
కథ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : శ్రీనివాస్ గోపిశెట్టి
కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి
నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య
విడుదల తేదీ: 15,మార్చి 2024.
Ananya Nagalla, Tantra, Srinivas Gopishetty