గార్లదిన్నె: నిరంకుశ, విధ్వంసకర వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా పనిచేయాలని సింగనమల నియోజకవర్గం టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, , టూమెన్ కమిటీ సభ్యులు ఆలం నర్సా నాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిలు పిలుపునిచ్చారు. శనివారం గార్లదిన్నె మండలం టిడిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా వారితో పాటు… జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ సాకే మురళీకృష్ణ, రాష్ట్ర కార్యనిర్వ కార్యదర్శి రామలింగారెడ్డి, రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, మండల కన్వీనర్ పాండు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకే , టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిందన్నారు. కలసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.వచ్చే ఎన్నికలలో టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఓటును పోలింగ్ బూత్ వరకు తీసుకు రావాలసిన బాధ్యత ఉందని అన్నారు. మన బిడ్డల, రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ గెలుపు చారిత్రక అవసరం అన్నారు. ఈసారి ఎన్నికల్లో వైసిపి చిత్తగా ఓడిపోవడం ఖాయం అన్నారు. సింగనమల నియోజకవర్గం లో టిడిపి అభ్యర్థి బండారి శ్రావణి శ్రీ ని కలిసికట్టుగా గెలిపించుకుని… రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడును చేసేవరకు ఈ 45 రోజులు పాటు నిరంతరం కష్టపడి పని చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. టిడిపి మేనిఫెస్టో పెట్టిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని టిడిపి ముఖ్య నేతలు , క్లస్టర్ ఇంచార్జ్ లో బూత్ కమిటీ మెంబర్లు మండల కమిటీ నాయకులు సర్పంచులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు, తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు హాజరు కావడం జరిగింది.