• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

admin by admin
January 14, 2026
in movies, Special Photo
0 0
0
ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి బర్త్ డే సందర్భంగా ఘనంగా దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ పరిచయ కార్యక్రమం

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా “వేదవ్యాస్”. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. బుధవారం నిర్మాత కె.అచ్చిరెడ్డి బర్త్ డే పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆయన పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” హీరో పిడుగు విశ్వనాథ్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

*నటుడు సాయికుమార్ మాట్లాడుతూ -* అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారి సినిమాలో నేను నటించడం ఇదే తొలిసారి. అయితే వారి ఫస్ట్ డబ్బింగ్ మూవీ సూర్య ది గ్రేట్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. అప్పటినుంచి వారితో మంచి అనుబంధం ఉంది. అయితే చాలాసార్లు వారి మూవీస్ కు డబ్బింగ్ చెప్పాను గానీ ఎందుకో నటించడం కుదరలేదు. ఈ చిత్రంతో నాకు ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. “వేదవ్యాస్” సినిమాలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్ లో నటిస్తున్నాను. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు. మన నాగరికతను మనం మర్చిపోకూడదు అనే మంచి అంశంతో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి గారు రూపొందిస్తున్నారు. ప్రేమకావాలి సినిమాతో అచ్చిరెడ్డి గారు మా ఆదిని పరిచయం చేశారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో ఈ రోజు విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం చూస్తుంటే అంతే సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు గారి కొడుకు పిడుగు విశ్వనాథ్ హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

*పిడుగు సుబ్బారావు మాట్లాడుతూ* – ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి గారి గొప్ప కాంబినేషన్ మూవీతో మా అబ్బాయి విశ్వనాథ్ హీరోగా పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇంతకంటే హ్యాపీగా ఫీలైన సందర్భం లేదు. కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. అన్నారు.

*జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ -* నేను ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు పీఆర్ఓ గా పనిచేశాను. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారితో నాకు ఎంతో స్నేహం, అనుబంధం ఉన్నాయి. అయితే వారి చిత్రాలకు నేను పీఆర్ఓ గా వర్క్ చేయలేదు. ఒకరోజు అచ్చిరెడ్డి గారు ఆఫీస్ కు పిలిచి ఈ మూవీకి పీఆర్ఓ గా వర్క్ చేయాలని చెప్పారు. ఆయన నాకు ఈ అవకాశం ఇవ్వడం వెనక గొప్ప మనసు ఉంది అదేంటంటే ఇటీవల నా జీవితంలో ఒక విషాధం జరిగింది. ఆ ఆలోచనల నుంచి నన్ను మల్లించాలి, నన్ను ఏదో వ్యాపకంలో ఉంచి బిజీ చేయాలనే ఆలోచనతో అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు “వేదవ్యాస్” సినిమాకు పీఆర్ఓగా పెట్టుకున్నారు. వారి మంచి మనసుకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంది. ఈ కథ కృష్ణారెడ్డి గారు నాకు చెప్పారు. ఒక గొప్ప చిత్రాన్ని ఆయన మన ముందుకు తీసుకురాబోతున్నారు. అన్నారు.

*హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ* – “వేదవ్యాస్” సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. వారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈ మూవీలో బాగా నటించేందుకు, బాగా కనిపించేందుకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందిరికీ థ్యాంక్స్. నాకు గతంలో ఏడీగా వర్క్ చేసే అవకాశం కల్పించారు నీరజ కోన, త్రికోటి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

*ప్రొడ్యూసర్ కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ* – మా ఎస్వీ కృష్ణారెడ్డి ఎంతో పట్టుదలగా తయారుచేసుకున్న స్క్రిప్ట్ ఇది. దాదాపు ఐదారేళ్లుగా ఈ మూవీ మీద ఆయన వర్క్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా కోసం ప్రతీ విషయం కొత్తగా ఉండాలని ఆయన కోరుకున్నారు. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీ ని సెలెక్ట్ చేసుకున్నారు. కొరియా అమ్మాయిని మన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అని నేను అడిగితే కొరియా అమ్మాయిని కాదు ఆ క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేస్తారు అని కృష్ణారెడ్డి చెప్పారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్ ను సెలెక్ట్ చేశారు. ఒక కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్ ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక కృష్ణారెడ్డి గారి జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది. ఈ సినిమాలో సాయికుమార్ గారు వేద నారాయణ అనే ఒక ప్రధానమైన పాత్రలో నటించారు. సాయి గారికి ఈ చిత్రంతో ఎన్నో ప్రశంసలు దక్కుతాయి. ఆయనతో మాకు మా మొదటి సినిమా నుంచి అనుబంధం ఉంది. పొలిటీషియన్, విద్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు మాకు మంచి మిత్రులు. జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలనే ధ్యేయంతో కృష్ణారెడ్డి గారు రెడీ చేసిన స్క్రిప్ట్ ప్రతాపరెడ్డి గారికి బాగా నచ్చి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. “వేదవ్యాస్” చిత్రంలో హీరోగా విశ్వనాథ్ ఎంత బాగా నటించాడు అనేది మూవీలో చూస్తారు. అన్నారు.

*డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ* – విశ్వనాథ్ ను హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆయన ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మంచి ఫైట్స్ చేశారు. నేను షూటింగ్ చేశా కాబట్టి ఈ విషయం చెబుతున్నా. విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే మా మూవీలో కీలకంగా ఉండే వేద నారాయణ అనే పాత్రలో సాయికుమార్ గారు నటించారు. ఆయన సహజంగానే బాగా నటిస్తారు. మా చిత్రంలో సాయికుమార్ గారి నటన దర్శకుడిగా నాకెంతో సంతృప్తిని కలిగించింది. “వేదవ్యాస్” సినిమాలో కొరియన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాం. ఆమె తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ చెప్పుకుంది. అలాగే మంగోలియా విలన్ బాగా నటించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనం చాటేలా రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మేము ఇక్కడ చెప్పేది చాలా తక్కువ. మిగతా అంతా మూవీలో చూస్తారు. అన్నారు.

*నటీనటులు -* పిడుగు విశ్వనాథ్, జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్, తదితరులు

*టెక్నికల్ టీమ్*
*————————–*
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ – ఆకుల సునీల్
మేకప్ – రాఘవ రాపర్తి
కాస్ట్యూమ్స్ – గుబ్బల నరసింహారావు, చందాన రామకృష్ణ
స్టిల్స్ – మనీషా ప్రసాద్
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలె
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఉదయభాస్కర్
లిరిక్ రైటర్స్ – భువనచంద్ర, డా.వెనిగళ్ల రాంబాబు
డ్యాన్స్ మాస్టర్ – సుచిత్ర చంద్రబోస్
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి
డీవోపీ – శరత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మేడపాటి శ్రీనివాస్ రెడ్డి పీఆర్ఓ – ప్రభు
సమర్పణ – కె. అచ్చిరెడ్డి
నిర్మాత – కొమ్మూరి వి ప్రతాప్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం – ఎస్వీ కృష్ణారెడ్డి

Previous Post

ప్రముఖ దర్శకుడు వి. సముద్ర , బెజవాడ బేబక్క సంయుక్తంగా విడుదల చేసిన”వెంకీ పింకీ జంప్” సినిమా ఆడియో

Next Post

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Next Post
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్
movies

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

by admin
September 10, 2026
0

...

Read more
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In