• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

admin by admin
February 17, 2026
in politics, Special Photo
0 0
0
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కలిసికట్టుగా సామాజిక ఆర్థిక అభివృద్ధి ..

పే దరికానికి ఎదురు నిలిచిన ఆదర్శ గ్రామం..

సామాజిక వెనుకబాటుతనానికి ఎదురు నిలిచి రాజ్యాంగం కల్పించిన హక్కులు, సౌకర్యాలను ఆసరాగా చేసుకుని ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది ఎర్రబండ. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన కంబ‌దూరు మండలం లోని ఈ గ్రామంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఇక్కడి యువత. కేవలం 40 కుటుంబాలు నివ‌సించే గ్రామంలో 13 మంది ప్రభుత్వ ఉద్యోగాలు, ఆరుగురు ప్రైవేటు కొలువులు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జీవన కట్టుబాట్లు, సామాజిక పరిస్థితులను ఒక అవకాశం గా చేసుకొని ఈ గ్రామం నుండి ఇటీవల గ్రూప్ 2లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి న‌ రాజ‌శేఖ‌ర్‌ మార్గ‌ద‌ర్శిగా నిలిచి ప్రభుత్వ ఉద్యోగాల పరంపరను కొనసాగిస్తున్నారు.

వ్య‌వ‌సాయ‌మే తోడుగా..

ఓకే సామాజిక‌వర్గం నుంచి ఈ స్థాయిలో ఉద్యోగాలు సాధించే క్రమంలో వ్యవసాయం, కూలి పనులు చేస్తూ ఉన్నత విద్యను పూర్తి చేసి ఇక్క‌డి యువ‌త ఉద్యోగాలు సాధ‌స్తున్నారు. పోలీసు శాఖ‌లో న‌లుగురు, విద్యాశాఖ‌లో న‌లుగురు, బ్యాంకింగ్ త‌దిత‌ర శాఖ‌ల్లో 5 గురు ప్ర‌భుత్వ కొలువులతో ముందుకు సాగుతున్నారు. 6 గురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించి ఈ రంగంలోనూ త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు కూడా పదుల సంఖ్యలో యువత డిగ్రీలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల అన్వేషణలో తలమునకలై ఉన్నారు.

ఒకే మాట- ఒకే బాట..

గ్రామంలో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు ఏటా తరచూ కలుస్తూ యువతకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. దీంతో యువతలో ఉద్యోగాలు సాధించాల‌న్న ప‌ట్టుద‌ల క‌నిపిస్తోంది. పండుగల వేళ‌ ఉద్యోగులు గ్రామానికి చేరుకుని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి గ్రామ‌స్థుల‌ను ఏకతాటిపైకి తెచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. గత సంక్రాంతికి గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు గ్రామస్తుల ఐక్యతకు వేదికగా నిలిచాయి. గ్రామ పెద్దలు, ఉద్యోగులు ఒకే మాటపై నిలుస్తూ ఒక‌రికొక‌రు తోడుగా ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇక్కడే భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తూ మూలాలు మ‌ర్చిపోకుండా గ్రామాభివృద్ధికి ఆలంబనగా నిలుస్తున్నారు.

ప్రశంసలు ..

గ్రామం నుండి కొలువులు సాధించిన వారు వారి వృత్తిపరమైన జీవితాల్లో కూడా రాణించి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. గ్రామం నుంచి ఎస్సైగా ఎంపికై తిరుప‌తిలో ప‌నిచేస్తున్న‌రామాంజనేయులు డీజీపీ గారి నుంచి ఎబిసి అవార్డు తీసుకున్నారు. కంబ‌దూరులోనే ఎల్ ఎస్ ఏ గా పనిచేస్తున్న పద్మజ పంద్రాగస్టు నాడు మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గమనార్హం. విద్యాశాఖ‌లో ప‌నిచేస్తున్న‌వారు కూడా ఉన్న‌తాధికారుల నుండి ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నారు.

మూలాలు మ‌రువ‌రాదు..

ప్రతికూల పరిస్థితు ల్లో చదవడం వలన నా మానసిక దృక్పథం రెట్టింపు అయింది. జీవితంలో ఎదగడానికి చదువు ఒక్కటే మార్గం. ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్న మూలాలు మరిచిపోకూడదు. – SI రామాంజినేయులు

ప‌ట్టుద‌ల‌తోనే విజ‌యం..

సూర్యకిరణాలను అరచేతితో ఎలా ఆపలేమో.. అలాగే కృషి, పట్టుదల ఉంటే ఎన్నో విజయాలు వరిస్తాయి. పుట్టుకతో తల్లిదండ్రులు మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు. వారిని ప్రపంచానికి పరిచయం చేయడానికి మనం ఉన్నతంగా ఎదగాలి.-LSA ప‌ద్మ‌జ‌

Previous Post

When Goodbye Becomes the Most Romantic Hello Story

Next Post

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In