గతంలో పచ్చపార్టీ నాయకులు కాల్ మనీతో అమ్మాయిలను ఎలా వేధించారో తెలిసిందే. అప్పులిచ్చి మరీ మహిళలను లైంగికంగా వేధించిన చరిత్ర పచ్చపార్టీ నాయకులకుంది. ఇప్పుడు తాజాగా సాయం కోరి వచ్చిన మహిళలతో రొమాన్స్ చేసిన చరిత్ర ఆ పార్టీ నాయలకులకే దక్కింది. అందుకే ఆ పార్టీలో ఏ మహిళా నాయకురాలూ ఇమడలేక పార్టీని వీడి… ఆ పార్టీ నాయకులను దుమ్మెత్తిపోశారు. సినీనటి కవిత, దివ్యవాణి, యామిని శర్మ… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహిళలు ఇలా ఆ పచ్చపార్టీని వీడి వెళ్లిపోయారు. తాజాగా రాయలసీమకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే తన వద్దకు సాయం కోసం వచ్చిన మహిళతో అసభ్యకరంగా చాటింగ్ చేసి దొరికిపోయారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈయనగారు సదరు మహిళలను లోబరుచుకొని… ఆమెను లైంగికంగా వేధించినట్టు ఇటీవల ఆయన వాట్స్ ప్ చాటింగ్ తో బట్టబయలు అయింది. ఇలా బయటపడిన బాగోతం ఇదొక్కటే. మరి బయటకు రాని లీలలు ఇంకెన్ని ఉన్నాయో…?!!!