దత్తపుత్రుడు అని జగన్ గారు ఎందుకు పేరు పెట్టారో ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్ని చూస్తే మరోసారి మరింతగా అర్థమౌతుంది.
– జగన్‌ను పంపించేద్దాం అని ఈనాడులో హెడ్డింగ్ పెట్టారు. ఓటర్లు కులపరంగా విడిపోవద్దు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇవన్నీ చూస్తే ఎవరి ఎజెండా కోసం పవన్ తన జెండాను దింపేశారో బాగా అర్థమౌతోంది.
– గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన ఓ వ్యక్తిని తమ పత్రికల్లో పతాక శీర్షికలకు తీసుకువెళ్లారంటే అందుకు ఏకైక కారణం సొంతంగా ఈనాడు యాజమాన్యం పాపాల పుట్ట బద్దలు అవుతుండటం వల్లే కదా.
– పవన్ కల్యాణ్‌ను హత్య చేయటానికి లేదా అంతమొందించటానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదే ప్యాకేజీ స్టార్ అప్పట్లో ఆరోపిస్తే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం మీద అవే ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించనట్లైతే పవన్ కల్యాణ్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– పవన్ కల్యాణ్ ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ సీట్లు, డబ్బుల ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ఇక, మిగిలింది డైలాగులు. ఏ రోజు ఏం మాట్లాడాలో అవి బాబు ఇంటి నుంచి వస్తూనే ఉన్నాయి. నేను ఎమ్మెల్యే కావాలని మొదటి రోజు స్ర్కిప్టూ అక్కడ నుంచే వచ్చింది. అంటే.. సీఎం రేసులో పవన్ లేడని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిరాశపడి వెనక్కి వెళ్లిపోతున్నారని అర్థంకాగానే ఎలాగూ టీడీపీతో కలిసే వెళ్తాడు కాబట్టి మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ మరో డైలాగ్ కూడా టీడీపీయే పవన్ కల్యాణ్‌తో చెప్పించింది.
– జగన్ గారి పాలన మీద పవన్ కల్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ఈ వ్యాఖ్యల్లో నిజం ఉంటే.. పవన్ కల్యాణ్ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా. మరి, ఆ పని ఎందుకు చేయటం లేదు. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చెప్పినట్లు సెలక్టివ్‌గా పోటీ చేసి తన సీటు కూడా తాను గెలవలేని వాడు వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ఎన్ని ఓట్లు తగ్గుతాయో తన చిలకతోనో, ఎలకతోనో ఒక జ్యోతిష్యం చెప్పిస్తాడు.
– జగన్ గారి ప్రభుత్వంలో ఇప్పటికే 2.16 లక్షల కోట్ల డీబీటీ జరిగిందా? లేదా? ఇటువంటి మేలు చరిత్రలో ఎప్పుడైనా ఇంటింటికీ జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు కాబట్టే.. ఇసుక, మద్యం అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నాడు.
– ఇక, క్లాస్‌వార్‌కు సంబంధించి పవన్ కల్యాణ్‌కు చారుమంజుదార్, తరిమెల నాగిరెడ్డి గుర్తుకు వచ్చారు. చంద్రబాబే ఆయనకు చేగువేరా. నారాజమిందారే చారుమంజుదార్. పుచ్చిన బుర్ర చంద్రయ్యే పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన ఇచ్చే తీర్థం, ప్రసాదం, పుష్పం, ఫలం, గోదానం, భూదానం అన్నీ అందుకుని పార్టీ ఆఫీసు, వ్యక్తిగత సెటిల్‌మెంట్లు అన్నీ చేసుకున్నాడు కాబట్టే.. ఇప్పుడు ఈ నారా జమీందార్, ఈ చంద్రగువేరా అనేవాడు అత్యంత ప్రీతిపాత్రుడుగా కనిపిస్తున్నాడు.
– బాబు ఫిలాసిఫీయే పవన్ ఖులాసఫీ. కాబట్టి, ఎల్లో మీడియాను పిలుచుకుని వారికి ఏం కావాలంటే అది చెబుతాడు. వారు రాస్తారు.. వేస్తారు. ఇక, మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వ చర్యల్ని ఏ న్యాయస్థానమూ అడ్డుకోదు. ఎందుకంటే.. తప్పు జరిగింది కాబట్టి. మార్గదర్శిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం జగన్ గారికి లేదు. నిజానికి, చంద్రబాబు హయాంలో ఓ చార్మినార్ బ్యాంక్, ఓ కృషి బ్యాంక్, గతంలో ఎత్తిపోతే 2014-19 మధ్య అగ్రిగోల్డ్ ఎత్తిపోవటానికి కారణం చంద్రబాబే. అయినా, అగ్రిగోల్డ్ ఇన్వెస్టర్ల ప్రయోజనాల దృష్ట్యా జగన్ గారి ప్రభుత్వమే వారికి ప్రతి రూపాయి చెల్లించింది. అటువంటి పరిస్థితి మళ్లీ మార్గదర్శిలో పునరావృతం కాకుండా అడ్డుకోవటానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంటే సమర్థించాల్సింది పోయి.. ఎల్లో గ్రూప్‌ను ఎత్తి నెత్తిన పెట్టుకుంటున్నాడంటే పవన్ కల్యాణ్ విలువల వ్యవస్థే డే వన్ నుంచి ప్రశ్నార్థకం.
– ఇదే పవన్ కల్యాణ్ గతంలో ఇదే ఎల్లో మీడియా గురించి ఏం మాట్లాడారో.. గుర్తు చేసుకుంటే.. ఈ ఇంటర్వ్యూలు మొదటి పేజీలో వేసిన పత్రికలు కనీసం సిగ్గుపడేవి. పవన్ కల్యాణ్‌కి నాలుక మడతేయటం చాలా ఈజీ, ఎల్లో మీడియాకు అతన్ని వాడుకోవటం అంతకన్నా ఈజీ.
– అన్ని పార్టీలు ఏకం అవ్వాలని, కులాల పరంగా విడిపోవద్దని పవన్ కల్యాణ్ అన్నట్టుగా రాశారు. జగన్ గారి పాలన బాగోలేదనుకుంటే.. కూటములతో పనేంటి? 2019లో చంద్రబాబును రక్షించటానికి విడిగా వెళ్లిన పవన్ కల్యాణ్ తాను మునిగాడు తప్ప వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు అధికార పార్టీని ఈ జిమ్మిక్కులతో ఓడించలేం కదా. నిజంగా వ్యతిరేక ఓటు ఉంటే.. వీరంతా విడిగా పోటీ చేయటంలో ఎందుకు వెనకాడుతున్నట్లు. మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టే.. పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. పొత్తులు పెట్టుకోవటానికి ఒక సైద్ధాంత బలం లేదు కాబట్టే.. వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అంటూ ఒక డైలాగ్ అందుకున్నారు. ఇంతకు మించి వీరు రాజకీయంలో నీతి లేదు, నిజాయితీ లేదు, అభివృద్ధి లేదు. ప్రజా ప్రయోజనం అంతకన్నా లేదు.
– దోచుకుందాం.. పంచుకుందాం.. తినుకుందాం అన్న నినాదాల కలయికగానే మూడు నాలుగు పార్టీలు కలసి రావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటున్నాడు.
– అసలు పదేళ్లు ఈ స్టేట్‌లోనే తన కుటుంబంతో వచ్చి ఒక్కరోజు కూడా లేనివాడికి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని ఎవరైనా నమ్మితే.. ఇంతకన్నా అమాయకత్వం ఉంటుందా?