• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మెసేజ్ ఇచ్చే… నేడే విడుదల

admin by admin
March 10, 2023
in movies
0 0
0
మెసేజ్ ఇచ్చే… నేడే విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఐకా ఫిల్మ్ ఫాక్టరీ పతాకంపై అసిఫ్ ఖాన్ – మౌర్యాని జంటగా నటించిన చిత్రం “నేడే విడుదల”. నూతన దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే (మార్చ్ 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రాన్ని నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ప్రచార చిత్రాలతో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:
సినిమాలను ప్రమోషన్ చేసే ఓ కంపెనీలో సిద్ధూ(అసిఫ్ ఖాన్) పనిచేస్తూ ఉంటారు. అదే సమయంలో హారిక (మౌర్యాని)ని ప్రేమిస్తూ ఉంటాడు. నిర్మాత సత్యానంద్ (డైరెక్టర్ కాశీ విశ్వనాథ్) ఓ భారీ బడ్జెట్ మూవీని నిర్మించి… దానిని ప్రమోట్ చేయాల్సిందిగా సిద్ధూని కోరతాడు. సినిమాని ప్రమోట్ చేసి… ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చేంతగా మూవీకి హైప్ తీసుకొస్తాడు సిద్ధూ. అంత బాగా ఓపెనింగ్స్ వచ్చిన సినిమా… పైరసీ బారిన పడి అనుకోకుండా డౌన్ ఫాల్ కావడంతో నిర్మాత సత్యానంద్ చనిపోతారు. అంత పెద్ద నిర్మాత మరణించడం సిద్ధూ జీర్ణించుకోలేకపోతాడు. అసలు నిర్మాత చనిపోవడానికి కారణాలు ఏంటి? అతని మరణం సమంజసమేనా? అంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకి ఉన్నట్టుండి కలెక్షన్లు పడిపోవడానికి గల కారణాలను సిద్ధూ తెలుసుకున్నాడా? తెలుసుకుని ఉంటే ఏమి చేశాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ:
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగానే ఉంటాయి. వాటికి కాస్త మెసేజ్ ఇచ్చే కంటెంట్ జోడిస్తే… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తాయి. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉండి… దానికి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని… ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా మూవీని తెరమీద చూపించగలిగితే… సినిమా తీసిన నిర్మాతలూ సేఫ్… దర్శకుడికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ తోనే ‘నేడే విడుదల’ చిత్రం తెరకెక్కింది. ఆసక్తికరమైన కథ… కథనంతోపాటు… ఆలోచింపచేసే ఓ మెసేజ్ ను ఇందులో ఇచ్చాడు దర్శకుడు. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయిన ఈ చిత్రంలోని సన్నివేశాలు… సెకండాఫ్ లో ఓవైపు ఫ్యామిలీ ఎంటర్టైన్ తో పాటు… మరోవైపు సినిమాలో అసలు కోర్ పాయింట్ కి కావాల్సిన మూలాలను వెతికే సన్నివేశాలను చూపించారు. సెకెండాఫ్ లో మంగళూరుకి స్టోరీ షిఫ్ట్ అయిన తరువాత హీరోయిన్ ఇంట్లో వచ్చే ‘శాకాహారం’ కామెడీ సరదాగా నవ్విస్తుంది. దానికి తోడు ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ రొటీన్ ఫుడ్ అలవాటు పడిన వారికి శాకాహారం తీసుకుంటే వారి జీవన శైలి ఎలా ఉంటుంది? వాటి వల్ల ఆయుష్షును ఎలా పెంచుకోవచ్చు? తదితర విషయాలన్ని ఆడియన్స్ కి పనికొచ్చేవే. అలాగే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తీసిన సినిమా… రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడం వల్ల నిర్మాతలు ఆర్థికంగా ఎలా నష్టపోతారనేది ఇందులో ఎంతో ఉద్వేగంగా చూపించారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ లపై చాలా సినిమాలు ఉన్నా… ఇందులో దానికి పరిష్కారం చూపించడం కొత్తగా ఉంది.
హీరో ఆసిఫ్ ఖాన్ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఓ బాధ్యతగల యువకుని పాత్రలో చక్కగా నటించారు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్ లో అలరించాడు. అతనికి జోడీగా నటించిన మౌర్యాని అటు గ్లామర్… ఇటు పర్ ఫార్మెన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నిర్మాత పాత్రలో దర్శకుడు కాశీవిశ్వనాథ్ కాసేపు కనిపించినా… మెప్పించారు. హీరో స్నేహితులగా నటించిన ఇద్దరూ ద్వితీయార్థంలో చక్కగా నవ్వించారు. ముఖ్యంగా సినిమా తారలను అనుకరించే పాత్రలో నటించిన నటుడు బాగా నవ్వించారు. హీరో తండ్రి పాత్రలో అప్పాజీ అంబరీషా తన పాత్ర పరిధి మేరకు నటించారు. మిగతా పాత్రల్లో నటించిన మాధవి, టి.ఎన్.ఆర్, అదుర్స్ ఆనంద్, పీలా గంగాధర్, జబర్దస్ నవీన్, అశోక వర్ధన్, రసజ్ఞ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈ చిత్రంతో హీరోగా పరిచయమయిన అసిఫ్ ఖాన్ కి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పొచ్చు. అతని నటన చాలా సహజంగా ఉంది.

ఇక దర్శకుడి విషయానికి వస్తే… సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎలాంటి సమస్యతో ప్రధానంగా నష్టపోతోందో… ఆ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని… దాని చుట్టూ అల్లుకున్న కథనం… ఎంగేజింగ్ నడిపించడంలో దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల విజయం సాధించారు. ఈ సినిమాకి అజయ్ అరసాడ అందించిన సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. సి హిచ్ మోహన్ చారి అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. హీరో, హీరోయిన్ జంటను అందంగా చూపించారు. నిర్మాతలు నజురుల్లా ఖాన్, మస్తాన్ ఖాన్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. చిన్న చిన్న లోపాలున్నా ఈ చిన్న సినిమా ఓవరాల్ గా చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది!!
గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3/5

Previous Post

యూత్ ని ఆకట్టుకునే మిస్టర్ కళ్యాన్

Next Post

జగనన్న దెబ్బకు ఎన్టీవీ రేటింగ్ ఢమాల్

Next Post

జగనన్న దెబ్బకు ఎన్టీవీ రేటింగ్ ఢమాల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In