• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“గ్రంథాలయం” ప్రేక్షకుల్ని అలరిస్తుంది

admin by admin
March 4, 2023
in movies
0 0
0
“గ్రంథాలయం” ప్రేక్షకుల్ని అలరిస్తుంది
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

కమర్షియల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ “గ్రంథాలయం”మూవీ రివ్యూ

నటీనటులుః
విన్నుమద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలకేయప్రభాకర్‌, సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీశినాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ ::వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ః) : అల్లంనేని అయ్యప్ప,
రచన దర్శకత్వం : శివన్‌ జంపాన.
సినిమాటోగ్రఫీ : సామలభాస్కర్‌,
సంగీతం : వర్ధన్‌,
ఎడిటర్‌ : శేఖర్‌పసుపులేటి,
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ఃల్ : చిన్నా,
ఆర్ట్‌డైరెక్టర్‌ : రవికుమార్‌ మండ్రు,
పి. ఆర్. ఓ : దీరజ్, ప్రసాద్

కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు.. అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సినిమానే
“గ్రంధాలయం”. విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియాచదరి నటీనటులుగా సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 3 న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన “గ్రంధాలయం” సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి..

 

కథ
ఒక గ్రంధాలయం లో ఉన్న 1965 నాటి బుక్ ను అందరూ చదవలేరు. అయితే చదవాలని ప్రయత్నించి మూడు రోజులు చదివిన తరువాత చదివిన వారందరూ
చనిపోతుంటారు. ఆలా అప్పటి వరకు సుమారు 100 మంది ఆ బుక్ చదివి చనిపోయింటారు. అయితే హీరో రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ (విన్ను మద్దిపాటి), హీరోయిన్ ఇందుమతి వాత్సల్య (స్మితారాణి బోర) ప్రేమించుకొని ఉంటారు. అయితే అనుకోకుండా తను ఈ బుక్ చదవడం మొదలు పెడుతుంది. అయితే రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ కు ఆ బుక్ ను మూడు రోజులు చదివిన తరువాత చనిపోతారానే విషయం తెలుసుకొని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో ఆ బుక్ ఎక్కడ నుండి వచ్చింది.ఆ బుక్ ను అక్కడకు తెచ్చిన వారెవరు?. చదివిన వారు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని తెలుసుకువాలని ఒకరోజు రాత్రి కెమెరా తీసుకొని రహస్యంగా గ్రంధాలయం లొకి వస్తాడు. గ్రంధాలయం లొకి వచ్చిన తరువాత అక్కడ తనకు ఎదురైనా సంఘటనలు ఏమిటి, ఆ బుక్ ను చదివిన హీరోయిన్ ను చనిపోకుండా ఆపగలిగాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే . సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గ్రంధాలయం సినిమా చూడాల్సిందే..

నటీ, నటులు

శేఖరం అబ్బాయి సినిమా తర్వాత చేసిన హీరో విన్ను రాజా హరిశ్చంద్ర కృష్ణ ప్రసాద్ పాత్రలో ఒదిగిపోయాడు.తన హావ భావాలతో నటుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇది సెకండ్ మూవీ ఇందులో చాలా బాగా నటించాడు.. ఇందుమతి వాత్సల్య పాత్రలో నటించిన హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. విలన్ గా నటించిన కాలకేయప్రభాకర్‌, అలాగే ఇందులో నటించిన సోనియాచౌదరి, అలోక్‌జైన్‌, జ్యోతిరానా, కాశీ విశ్వనాథ్‌, డా.భద్రం, మేకరామకృష్ణ, పార్వతి, శివ, శ్రావణి, మురళీకృష్ణ, నవ్యశారద, నరేంద్రనాయుడు. స్నేహగప్త తదితరులు అంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

 

సాంకేతిక నిపుణులు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు కొత్త కంటెంట్ ఉన్న సినిమాలనే నే ఆదరిస్తున్నారు. దర్శకులు కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు ఇప్పటి వరకు రానటువంటి కొత్త కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆలా వచ్చిన కొత్త కథే “గ్రంధాలయం “. కలగా వచ్చిన కథను సినిమాగా మార్చి రివర్స్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని ఆకట్టు కోనేలా సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా మలచడంలో దర్శకుడు సాయి శివన్‌ జంపాన సక్సెస్ అయ్యాడు అని చెప్పచ్చు. సామలభాస్కర్‌ చేసిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.చిన్నా చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.ఫైట్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. శేఖర్‌పసుపులేటి ఎడిటింగ్ పని తీరు బాగుంది.వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా సినిమాపై ఉన్న నమ్మకంతో ఎంతో నిజాయితీగా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలకు ఉన్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ సాయి శివన్‌ జంపాన కు ఉన్న నాలెడ్జ్ తో “గ్రంథాలయం”.సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకొని వెళ్లాయి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తంగా చెప్పాలి అంటే “గ్రంథాలయం”.” ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాను నమ్మి వచ్చిన ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుంది.

Previous Post

గ్రాండ్ గా జరిగిన “గ్రంథాలయం”ప్రి రిలీజ్ ఈవెంట్

Next Post

ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని గెలిపించి చరిత్ర తిరగ రాస్తాం -ఎమ్మెల్యే చింతల

Next Post
ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని గెలిపించి చరిత్ర తిరగ రాస్తాం -ఎమ్మెల్యే చింతల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని గెలిపించి చరిత్ర తిరగ రాస్తాం -ఎమ్మెల్యే చింతల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం
movies

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

by admin
February 28, 2026
0

...

Read more
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In