ఈరోజు పీలేరులో MM కళ్యాణ మండపం నందు పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన అన్నమయ్య జిల్లాకు సంబంధించి పార్టీ పదవులు పొందిన నాయకులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్యే గారితో కలిసి పాల్గొన్న తూర్పు రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ 8 నెలల క్రితం మన ముఖ్యమంత్రి గారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ వర్క్ షాపులో మాట్లాడుతూ మన పార్టీ తరపున మార్చిలో జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ నాకు స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని అనుకుంటున్నానని, మీ అభిప్రాయాలు తెలపాలని ఎమ్మెల్యేలను ఇన్చార్జిలను కోరగా ప్రతి ఒక్కరు కూడాఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారని, తూర్పు రాయలసీమ సంబంధించి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి పేరును స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారని, పదవులు పొందిన ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేసి శ్యాం ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన పెద్దాయన పేరు నలుదిశల వ్యాప్తి చెందెలా కోరారు.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినప్పటినుంచి 36 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్చార్జిలు, ప్రతి ఒక్కరు కూడా నన్ను అక్కున చేర్చుకొని, ఆదరిస్తున్నారని వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని, పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు ఇప్పటికైనా లభిస్తుందని, పార్టీ పదవులు పొందిన వారు బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు, జిల్లా అనుబంధ శాఖ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికైన వారిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సన్మానించి అభినందించారు. 13వ తేది జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ నమూనా నందు రెండవ సీరియల్ నంబరులో నా పేరు పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి వేయించి నన్ను ఆశీర్వదించాలని కోరారు.