యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో షిర్లీ సెటియా హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: కృష్ణా (నాగ శౌర్య) ఓ పద్దతిగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన అబ్బాయి. అతను హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరుతాడు. అక్కడ తన బాస్ అయిన నార్త్ ఇండియా కి చెందిన వ్రింద (షిర్లీ సెటియా) ని తొలి చూపులోనే ప్రేమలో పడి ఆమె ప్రేమను పొందుతాడు. అయితే తనకి పిల్లలు పుట్టరని అందుకే వేరే పెళ్ళి చేసుకో అని చెబుతుంది. అయినా కూడా కృష్ణ.. వ్రిందానే తన పెళ్ళంగా చేసుకోవాలని .. అందుకు ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తా అని మాటిస్తాడు. మరి సద్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన కృష్ణ… తన ప్రేమను ఇంట్లో వాళ్లకి చెప్పి ఎలా ఒప్పించాడు. అందుకోసం ఆడిన అబద్ధాలు ఏమిటి? చివరకు కృష్ణా వ్రిందల జంట ఎలా సెటిల్ అయుందనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో తెరకెక్కిన కథలు చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటాయి. కృష్ణ వ్రింద విహారి కూడా ఇలాంటి సినిమానే. ఫస్ట్ హాఫ్ లో సాప్ట్ వేర్ కంపెనీలోసత్య, రాహుల్ రామకృష్ణ, బ్రాహ్మజి, వెన్నెల కిశోర్ a కామెడీ సన్ని వేషాలు, హీరోయిన్ తో ప్రేమ సన్నవేశాల లాంటి సరదా సన్నివేశాలతో నింపేసి… ఇంటర్ వెల్ తరువాత… ఫ్యామిలీ డ్రామా తో ఆడియన్స్ ని రక్తి కట్టించారు. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కోమాలో వున్నప్పుడు వచ్చే కామెడి హిలెరియస్ గా వుంటుంది. టోటల్ గా ఫస్ట్ హాఫ్ సో సోగా వున్నా… సెకెండ్ హాఫ్ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది.
నాగ శౌర్య నటన బాగుంది. కామెడి టైమింగ్ బాగుంది. ఫ్యామిలీ డ్రామా సీన్స్ లోనూ మెచ్యూరిటీ చూపించారు. హీరోయిన్ కూడా నార్త్ ఇండియన్ గర్ల్ గా… చక్కగ నటించింది. నాగ శౌర్య తల్లి అమృత వల్లి పాత్రలో రాధిక శరత్ కుమార్ ఆకట్టుకుంది. అలాగే బ్రంహజి, రాహుల్ రామకృష్ణ, కమెడియన్ సత్య, వెన్నెల కిషోర్ కామెడీతో నవ్వులు పండించారు. అన్న పూర్ణమ్మ పాత్ర ఒకే. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో హిమాజ పాత్ర.. పాత్రకి తగ్గట్టు వుంది.
దర్శకుడు రాసుకున్న కథ… కథనాలు హి లేరియస్ గా వున్నాయి. కథలో కొంత రొ టీన్ వున్నా .. టేకింగ్ కొత్తగా వుంది. పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. హీరో హీరోయిన్ ని బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బాగుండేది. నిర్మాణ విలువలు క్వాలిటీ గా వున్నాయి. ఎక్కడ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3