కేసు వివరాలు :-
కడప తాలూకా U/G PS ఇన్ స్పెక్టర్ K. ఉలసయ్య అయిన నాకు 16.09.2022 వ తేదిన మంత్రి సునీల్ కుమార్ అను అతను పోలీస్ స్టేషన్ కు రాబడి, తను కడప టౌన్ నందు CMS ఆఫీస్ నందు ATM లకు కస్టోడియన్ గా పని చేస్తూ ఉంటాను, ప్రతి రోజు లాగానే 16.09.2022 వ తేదిన కడప 7– రోడ్స్ నందు గల SBI బ్యాంకు నందు రు.71,00,000/- నగదు ను ATM లలో ఉంచే దానికి నేను, నా సహచర ఉద్యోగి అయిన మహేంద్ర రెడ్డి లము డబ్బులు తీసుకొని, సదరు డబ్బులను మా ఆఫీస్ కు చెందిన CMS YODHA No.MH09 CH 5866 కారు లో పెట్టుకొని, నేను, మహేంద్ర రెడ్డి మరియు కార్ డ్రైవర్ అయిన ఫరూక్ లము 7- రోడ్స్ వద్ద నుండి మా కంపెనీ కార్ లో బయలుదేరి లోహియా నగర్ ATM వద్దకు వెళ్లి అక్కడ వున్నా ATM లో డబ్బులు పెట్టడానికి వెళ్ళగా, కార్ డ్రైవర్ అయిన షేక్ ఉమర్ ఫరూక్ @ ఫరూక్ ఒక్కడే బయట డబ్బులు ఉండిన ఆఫీస్ కార్ తో ఉండినాడు. మేము సదరు ATM లో డబ్బులు పెట్టి బయటకి వచ్చి చూసే సరికి షేక్ ఉమర్ ఫరూక్ @ ఫరూక్ కార్ తో సహా పారిపొయినాడు. తర్వాత కార్ కు వున్నా GPS సహకారంతో లొకేషన్ ను కనుగోనగా వినాయక నగర్ దగ్గర షెడ్డు లో కారు వున్నట్లు గుర్తించి, అక్కడ వెళ్లి చూడగా కార్ మాత్రమే వుండినది. కారు లో వుండిన ఒక బాక్స్ అందులో వుండిన రు. 56 లక్షలు డబ్బులు, డ్రైవర్ ఫరూక్ కనిపించలేదు అని పిర్యాదు చెయడమైనది.
నేరం చేసిన విధానం:
చెన్నూరు మహబూబ్ బాషా, షేక్ ఉమర్ ఫరూక్ లు ఇద్దరూ స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసై ముద్దాయిలు అప్పులపాలయ్యారు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించాలన్న దురాశతో మహబూబ్ బాషా పక్కా స్కెచ్ వేసాడు. తన స్నేహితుడు ఫరూఖ్ ను ఎస్.బి.ఐ ఏటీఎం లలో నగదు లోడ్ చేసే వ్యాన్ కు డ్రైవర్ గా వెళ్లి నగదు చోరీ చేసేందుకు ప్రణాళిక రచించాడు. ఎస్.బి.ఐ ఏ.టి.ఎం లలో నగదు లోడ్ చేసే సి.ఎం.ఎస్ కంపెనీ లో ఈ నెల 16 న ఒక రోజు యాక్టింగ్ డ్రైవర్ గా విధుల్లో చేరాడు. ఈ క్రమంలో పధకం అమలు చేసేందుకు కావాల్సిన కారును సికిందర్ అనే కారు ఓనర్ వద్ద తమ బంధువులకు ఆరోగ్యం బాగాలేదని, బెంగళూరు లో ఆస్పత్రికి తీసుకెళ్లాలని, తనే డ్రైవర్ గా వెళ్తానని చెప్పి అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 16 న తొలుత ఎస్.బి.ఐ ఏ.టి.ఎం లో నగదు నింపేందుకు రూ. 71 లక్షల నగదుతో సి.ఎం.ఎస్ కంపెనీ కి చెందిన వ్యాన్ బయలుదేరి తొలుత చిలకలబావి వద్ద ఉన్న ఏ.టి ఎం లో రూ. 5 లక్షల నగదు ను నింపి, విజయ దుర్గ కాలనీ లోని ఏ.టి.ఎం లో మరో రూ. 5 లక్షల నగదు ను లోడ్ చేశారు. అనంతరం లోహియా నగర్ లోని ఏ.టి.ఎం లో సి.ఎం.ఎస్ కంపెనీ ఉద్యోగులు నగదు లోడ్ చేసే సమయంలో ఫరూఖ్ వ్యాన్ ను రివర్స్ చేసి పెట్టుకుంటానని చెప్పి అందులో మిగిలి ఉన్న రూ. 56 లక్షల నగదుతో సహా వ్యాన్ తో ఉడాయించాడు. వినాయక నగర్ సమీపంలో సిద్ధంగా ఉంచిన టయోటా ఎతియోస్ కారులో వ్యాన్ లో ఉన్న నగదు డబ్బాను కారులోకి మార్చేసి క్షణాల్లో అక్కడి నుండి పరారయ్యాడు.
అనంతరం వై.వి.యు సమీపంలో వేచి ఉన్న ప్రధాన నిందితుడు మహబూబ్ బాషా ఏ.టి.ఎం వ్యాన్ లోని నగదు ఉంచే పెట్టె ను పగలగొట్టి అందులోని నగదు ను కారులో నింపి ఫరూఖ్ ను బెంగళూరు కు వెళ్లాలని చెప్పాడు. తాను ఇక్కడే ఉండి గమనిస్తూ ఫరూఖ్ ను అప్రమత్తం చేస్తుంటానని భరోసా ఇచ్చాడు. తాను బెంగళూరుకు వచ్చిన తర్వాత నగదును తీసుకుంటానని చెప్పగా ఫరూఖ్ కార్ తో బెంగళూరు వైపుగా పరారయ్యాడు.
కేసు ను చేధించిన విధానము:
మంత్రి సునీల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు గురించి ఇన్ స్పెక్టర్ K.ఉలసయ్య గారు, రాజశ్రీ కడప SDPO శ్రీ B.V. శివారెడ్డి గారికి సమాచారము ఇవ్వగా, సదరు సమాచారము మేరకు రాజ శ్రీ కడప SDPO గారు తక్షణమే వినాయక నగర్ సర్కిల్ కు వెళ్లి, అక్కడ ఉన్న CC కెమరాలను పరిశీలించి, అందులో నిక్షిప్తం అయిన సమాచారము ను సేకరించుకొని, ఫరూక్ యొక్క సెల్ నంబర్ ద్వార CDR డేటా ఆధారం గా కడప తాలూకా CI గారిని, కడప I TOWN CI గారిని, రిమ్స్ CI గారిని, కడప II Town CI గారిని, చిన్న చౌక్ CI గారిని, బృందాలుగా ఏర్పరిచి, ముద్దాయి గురించి వెతకటం ప్రారబించినారు.
అందులో భాగంగా రాజ శ్రీ జిల్లా అదనపు ఎస్.పి(అడ్మిన్) తుషార్ డూడి ఐ.పి.ఎస్ గారి పర్యవేక్షణలో కడప SDPO గారు అయిన B.V. శివా రెడ్డి గారి ఆద్వర్యంలో లోని బృందాలు పెండ్లి మర్రి మండలం, వెల్లటూరు గ్రామము వద్ద ఉండిన CC కెమెరాలను పరిశీలించగా, షేక్ ఉమర్ ఫరూక్ @ ఫరూక్ AP 39 HG 3109 కార్ తోటి అక్కడి నుండి పులివెందుల వైపు పారిపొయినాడు అనే విషయం తెలుసుకొని, అనంతపురం జిల్లా మరియు కర్ణాటక రాష్ట్రము భాగేపల్లి పోలీసుల సహకారం తో అనంతపురం జిల్లా, కర్ణటక రాష్ట్రము బార్డర్ లో గల బాగేపల్లె టోల్ గేటు వారిని అలెర్ట్ చేయగా AP 39 HG 3109 అను నెంబర్ గల కారును టోల్గేటు వారు వాహనాలను ఆపి తనికి చేయడం గమనించి సదరు షేక్ ఉమర్ ఫరూక్ @ ఫరూక్ టోల్ గేటు కు కొంత దూరంలో కారు ను వదిలి పారిపోయినాడు. టోల్ గేటు వారి సహకారంతో రాజ శ్రీ కడప SDPO గారు అయిన B.V. శివా రెడ్డి మరియు తన బృందం అక్కడికి వెళ్లి కార్ ను తనికీ చేయగా అందులో రు.50,00,000/- ల నగదు ఉండినది. కారు కు కొంచెం దూరం లో రు.3,50,000/- డబ్బులు క్రింద పడివున్నవి. అంతట సదరు AP 39 HG 3019 Etios కార్ ను, మరియు రు.53,50,000/- ల డబ్బును స్వాధీనం చేసుకోవడం అయినది. తదుపరి ముద్దాయి అయిన షేక్ ఉమర్ ఫరూక్ @ ఫరూక్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం అయినది.
గంటల వ్యవధిలోనే చోరి కేసు ను చేదించటం లో కృషి చేసిన కడప SDPO B.వెంకట శివా రెడ్డి గారిని, కడప తాలూకా ఇన్ స్పెక్టర్ K. ఉలసయ్య గారిని, కడప I Town CI నాగరాజు గారిని, చిన్న చౌక్ CI అశోక్ రెడ్డి గారిని, కడప తాలూకా SI SKM. హుస్సేన్, II town SI రాఘవేంద్ర రెడ్డి గార్లను మరియు సిబ్బంది ని రాజశ్రీ వై.ఎస్.ఆర్ జిల్లా SP గారు అభినందించారు.