క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చేతుల మీదుగా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” సినిమా నుంచి ‘ఎర్రతోలు పిల్లా..’ లిరికల్ సాంగ్ రిలీజ్
యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీ హీరోయిన్ గా నటిస్తోంది. మధునందన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కమర్షియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.
శుక్రవారం ఈ చిత్రం నుంచి ‘ఎర్రతోలు పిల్లా..’ అనే లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ విడుదల చేశారు. పాట క్యాచీగా బాగుందన్న ఆయన చిత్రబృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ పాటను గిఫ్టన్ ఎలియాస్ స్వరకల్పనలో గిరి కోడూరి సాహిత్యాన్ని అందించగా ధనుంజయ్ పాడారు. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నటీ నటులు: ఉదయ్ శంకర్, జన్నీఫర్ ఇమ్మానుయేల్, మధునందన్, సీనియర్ హీరో సుమన్, పృధ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యాంగార్, గాయత్రి భార్గవి, కళ్యాణ్ తదితరులు
సాంకేతక వర్గం: సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్, మ్యూజిక్: గిఫ్టన్, ఎడిటర్: సాగర్ ఉడగండ్ల, ఆర్ట్: దొలూరి నారాయణ, పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా, నిర్మాత : అట్లూరి నారాయణ రావు, దర్శకత్వం : గురు పవన్