• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఆకట్టుకునే సకల గుణాభి రామ

admin by admin
September 16, 2022
in movies
0 0
0
ఆకట్టుకునే సకల గుణాభి రామ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మంచి కథ… కథనాలను రాసుకుని అప్ కమింగ్ హీరోలతో మంచి హిట్లు కొట్టిన అనుభవం మన టాలీవుడ్ కి వుంది. అందుకే కొత్తగా సినిమా తీసే నిర్మాతలు కానీ దర్శకులు కానీ కొంచం ఇంట్రెస్టింగ్ స్టోరీలను ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. తాజాగా రచయిత.. దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్… బిగ్ బాస్ షో విన్నర్ వి. జె.సన్నీ హీరోగా సకల గుణాభి రామను తెరకెక్కించాడు. అషీమా హీరోయిన్. తరుణీ సింగ్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. నిర్మాత సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఆడియెన్స్ లో మంచి పాజిటివ్ బజ్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియెన్స్ ను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ: రామ్(వి.జే.సన్నీ) ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. స్వాతి (అషిమా)అనే అమ్మాయిని ఎంతో ప్రేమించి పెళ్లాడుతాడు. అనంతరం ఓ కంపెనీలో తక్కువ జీతానికి పనిచేస్తూ జీవనం సాగిస్తూ వుంటాడు. ఆ జీతం చాలక వడ్డీ వ్యాపారం చేసే ప్రదీప్ (శ్రీ తేజ్) అప్పు తీసుకుని… వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా… రామ్ భార్య స్వాతి సంతానం వొద్దని… సేఫ్టీ వాడుదాం అని చెబుతూ పిల్లలని కనడం వాయిదా వేస్తూ వుంటుంది. ఈ క్రమంలో ఓ సారి భార్య మీద అఘాయిత్యం చేస్తాడు. దాంతో ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది.
అయితే రామ్ దీపిక (తరుణీ సింగ్)తో అక్రమ సంబంధం సాగిస్తాడు. దానివల్ల రామ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి… చాలీ చాలని జీతం. అలాంటి యువకుని జీవితంలో జరిగే ఫన్… ఇలాంటి కథలు నేటి యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే రచయిత… ఈచిత్రం డైరెక్టర్ వెలిగొండ శ్రీనివాస్ మంచి ఫన్ ఎలిమెంట్స్ తో కథ.. కథనాలను రాసుకుని ఎంటర్ టైన్ చేశాడు. ఫస్ట్ హాఫ్ అంతా… హీరో పనిచేసే కంపెనీలో సహా ఉద్యోగులతోనూ, యజమానితోను సరదా సరదా సన్నివేశాలతో టైం పాస్ మూవీగా సాగి… ఇంటర్వెల్ తరువాత పరాయి స్త్రీతో పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది… దాని వల్ల నేర్చుకునే గుణపాఠం.. తదితర విషయాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే కాదు… ఏవైనా పొరపాట్లు జరిగితే… వాటిని క్షమించే క్షమాగుణం కూడా భార్యా భర్తలకు వుండాలి. అప్పుడే అలాంటి బంధాలు సొసైటీలో చాలా బలంగా వుంటాయి అనే ఓ మెసేజ్ ని కూడా ఇచ్చాడు దర్శకుడు.

ఈ చిత్ర హీరో వి.జె.సన్నీ సాఫ్ట్వేర్ ఉద్యోగి గా… ఓ చిలిపి భర్తగా చక్కగా నటించాడు. కామెడీ, ఎమోషన్ సీన్స్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు. పాటల్లో డ్యాన్స్ కూడా ఎంతో ఈజ్ చూపించాడు. హీరోయిన్ అషిమ పాత్రకి తగ్గట్టుగా నటించింది. విలన్ భార్య గా దీపిక… పాత్రలో నటించిన తరుణీ సింగ్ తన బబ్లీ నటనతో ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ఆమెతో హీరో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. వడ్డీ వ్యాపారి ప్రదీప్ పాత్రలో శ్రీతేజ్ విలక్షణంగా కనిపించి మెప్పించాడు. సెవెన్ ఆర్ట్స్ సరయు బోల్డ్ పాత్రలో యుత్ ని ఆకట్టుకుంటుంది, విట్టా మహేష్ కామెడీ ట్రాక్ పర్వాలేదు.

దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్ మంచి కథ.. కథనాలను రాసుకున్నాడు. అయితే మరింత బాగా దాన్ని తెరమీద ఆవిష్కరించి వుంటే మంచి సినిమా అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాని రిచ్ గా తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్..!

రేటింగ్: 3

Previous Post

Photo gallery: కీర్తి సురేష్, CMR మాల్

Next Post

సుకుమార్ చేతుల మీదుగా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” సినిమా నుంచి ‘ఎర్రతోలు పిల్లా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

Next Post
సుకుమార్ చేతుల మీదుగా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” సినిమా నుంచి ‘ఎర్రతోలు పిల్లా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

సుకుమార్ చేతుల మీదుగా "నచ్చింది గర్ల్ ఫ్రెండూ" సినిమా నుంచి 'ఎర్రతోలు పిల్లా..' లిరికల్ సాంగ్ రిలీజ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్
movies

ఆసక్తికరంగా “జయహో రామానుజ” సినిమా ట్రైలర్

by admin
October 15, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

హైదరాబాద్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’

October 10, 2026
ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ తొలి వార్షికోత్సవ వేడుకలు

October 10, 2026
అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

October 3, 2026
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In