• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

1997 తెలుగు మూవీ రివ్యూ

admin by admin
November 26, 2021
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్

నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…
జానర్ : క్రైం థ్రిల్లర్
విడుదల : 26-11-2021

‘‘చిన్నప్పుడు నేను విన్న ఓ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. అది మాములు సంఘటన కాదు.. నేటికీ మన సమాజంలో
నిత్యం జరుగుతూనే ఉన్నాయి.. అందుకే ఆ సంఘటన అందరికి చెప్పాలన్న ప్రయత్నమే 1997 అని చెప్పాడు దర్శకుడు, హీరో మోహన్. పాఠశాల రోజుల్లో సెలవులకి ఊరికి వెళ్లినప్పుడు మా తాత చెప్పిన ఓ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది. కథ రాసుకున్నాక నిర్మాతల్ని, దర్శకుల్ని కలిశాం. ఈ కథని మరోలా చెప్పేందుకు ముందుకు రావడంతో నేనే దర్శకత్వం చేశా అని చెప్పాడు. డా. మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి 1997 లో ఏమి జరిగింది అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

సమాజంలో ఉన్న కులమతాల అసమానతల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పటికి మన దేశంలో చాలా ప్రాంతాల్లో తక్కువ కులాలపై, ఆ కులాలలో ఉండే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజాం పేట గ్రామంలో ఓ దొర హంగామా చేస్తుంటాడు. పైగా అతను ఆ ఊరికి ఎం ఎల్ ఏ. అతన్ని కాదని ఆ ఊరిలో ఎవరు ఏమి చేయరు. పైగా అతనికి పోలిసుల సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో గంగ అనే అమ్మాయి ఘోరంగా అత్యాచారానికి గురవ్వడంతో పాటు మరణిస్తుంది. ఆమె మరణాన్ని ఈత రాక నీళ్లలో మునిగి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే అదే గ్రామానికి ఏ ఎస్ ఐ గా వచ్చిన విక్రమ్ రాధోడ్ ( డా. మోహన్ ) నిజ నిజాలు తెలుసుకుని అసలైన దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో దొర ( రామరాజు ) కు సపోర్ట్ చేస్తూ అయన అన్యాయాలను కప్పిపుచ్చే సి ఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్ ) కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే న్యాయం అన్నది తక్కువ కులం , ఎక్కువ కులం అని కాకుండా అందరికి సమానంగా ఉండాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగి గంగ ను మానభంగం చేసి చంపినా దోషులను టార్గెట్ చేస్తాడు విక్రమ్ రాధోడ్. మరి ఈ పరిస్థితుల్లో విక్రమ్ రాథోడ్ కు ఎదురైనా అడ్డంకులు ఏమిటి ? దొర అహంకారానికి, కామానికి బలైన గంగ కు న్యాయం జరిగిందా లేదా అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది .. శ్రీకాంత్ అయ్యంగార్ గురించి. సి ఐ చారి పాత్రలో నెగిటివ్ షేడ్ లో అదరగొట్టాడు. శ్రీకాంత్ అయ్యంగార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రలో లీనమై నటించాడు. ఇక హీరో విక్రమ్ రాధోడ్ పాత్రలో డా. మోహన్ అదరగొట్టాడు. ఏ ఎస్ ఐ గా అయన పరిధిలో చక్కగా నటించాడు. ముక్యంగా పోలీస్ అధికారిగా భిన్నమైన షేడ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఎంక్వయిరీ అధికారిగా హీరో నవీన్ చంద్ర పాత్ర ఉన్నది కొద్దీ సేపే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారిగా న్యాయం పక్కన నిలబడాలని చేసే ప్రయత్నం బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటి డి జి పి గా బాగా చేసాడు. అలాగే దొర పాత్రలో రామరాజు నటన హైలెట్. అలాగే దొర కొడుకు రాంబాబు పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. మిగతా పాత్రల్లో ఎవరికీ వారు బాగా చేసారు.

టెక్నీకల్ హైలెట్ :

ఈ సినిమా విషయంలో టెక్నీకల్ అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి. ఈ సినిమాకు కోటి ఇచ్చిన ఆర్ ఆర్ ప్రధాన ఆకర్షణ. కథను డ్రైవ్ చేయడంలో కోటి ఆర్ ఆర్ సూపర్. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ ఫోటోగ్రఫి. చిట్టిబాబు అందించిన ఫోటోగ్రఫి బాగుంది. ఇక ఈ సినిమా విషయంలో మరో ముఖ్యమైన అంశం ఎడిటింగ్. సీనియర్ ఎడిటర్ నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. చాలా సీన్స్ అలా అలా పాస్ అయిపోతూ ఉంటాయి. ఇక దర్శకుడు , హీరో మోహన్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బార్నిన్గ్ ఇష్యు ని తీసుకుని దర్శకుడు మోహన్ చక్కటి ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో ఉన్న కులమతాల అసమానతలు , మహిళలపై జరుగుతున్నా దారుణాల నేపథ్యంలో ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు. ఆలోచింప చేసే కథ, కథనంతో చక్కటి ప్రయత్నం చేసాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

విశ్లేషణ :

‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన కథ ఇది. సమాజంలో అసమానతలకి అద్దం పట్టేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నవీన్‌ చంద్ర అధికారి పాత్రలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌… చారి అనే పోలీస్‌గా చాలా బాగా నటించారు. అసలు శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర సినిమాకే హైలెట్. ఇక సంగీత దర్శకుడు కోటి ఓ పాత్రతో పాటు ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. డా. మోహన్ హీరోగా, దర్శకుడిగా రెండు పాత్రల్లో చక్కగా చేసాడు. హీరోగా ఆకట్టుకున్నాడు. ఇక దర్శకుడిగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో జరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఎన్ని చిత్రాలు వచ్చినా కూడా ప్రజలు మారతారని చేసే ప్రయత్నాలే. నిజంగా అలాంటి సినిమాలు చూసి జనాలు మారతారా ? అన్నది ఇప్పటికి ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. మొత్తానికి డా. మోహన్ ఓ సమస్యను అందరికి తెలియచెప్పే గొప్ప ప్రయత్నం చేసాడని చెప్పొచ్చు.

Rating : 3.25/5

Source: 1997 movie review
Via: 1997 movie review
Tags: 1997 movie review
Previous Post

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

Next Post

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా ప్రభుదేవా, రెజీనా, అనసూయల ‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్

Next Post

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా ప్రభుదేవా, రెజీనా, అనసూయల ‘ఫ్లాష్ బ్యాక్’ ఫస్ట్ లుక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రికార్డు
politics

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రికార్డు

by admin
February 3, 2023
0

...

Read more
రివ్యూ ; సువర్ణ సుందరి

రివ్యూ ; సువర్ణ సుందరి

February 3, 2023
హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’

January 30, 2023
హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి, విడుదలకి సిద్ధం!

హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ షూటింగ్ పూర్తి, విడుదలకి సిద్ధం!

January 28, 2023
రిలీజ్ కు రెడీ అయిన చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

రిలీజ్ కు రెడీ అయిన చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ

January 28, 2023
ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

January 28, 2023
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వంలో “కొత్త రంగుల ప్రపంచం”

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వంలో “కొత్త రంగుల ప్రపంచం”

January 28, 2023
‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల

‘సోదర సోదరీమణులారా…’ ఫస్ట్ లుక్ విడుదల

January 26, 2023
‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తో ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు !!

‘కాంతార’ సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తో ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు !!

January 20, 2023
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In