• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

admin by admin
October 24, 2021
in movies
0 0
0
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువనే చెప్పాలి. మిగతా హీరోలకు అభిమానులు ఉంటారేమో కానీ ఒకరకంగా మెగాస్టార్ కు వీరాభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవి గారిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి గారు వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు.

కానీ వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు, దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తీయించి హైదరాబాద్ రప్పించారు. శనివారం నాడు చిరంజీవి గారు వెంకట్ ఆయన భార్య సుజాతను తన నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి. తన వీరాభిమాని వెంకట్, వెంకట్ భార్య సుజాతతో చిరంజీవి కూలంకషంగా వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి, మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో చెకప్ కోసం పంపించారు. ఒమేగా హాస్పిటల్స్ లో తెలిసిన డాక్టర్లతో మాట్లాడిన చిరంజీవి పరిస్థితి అడిగి తెల్సుకున్నారు.

అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించి, అక్కడి వైద్యులను సంప్రదించిన ఆయన దీనికి వెంకట్ సొంత ప్రాంతం అయిన విశాఖపట్నంలో హాస్పిటల్ లో చేర్చే విషయం గురించి మాట్లాడారు. విశాఖ హాస్పిటల్ లో ఖర్చలు తానే చూసుకుంటానని చిరంజీవి పేర్కొన్నారు. అవసరమైతే చెన్నై హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు. ఈ విషయం తెలిసి మెగా అభిమానులు అందరూ మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని చెబుతున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని కూడా మెగా అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Previous Post

నవంబర్ 12న కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క‌’ విడుదల

Next Post

1997 తెలుగు మూవీ రివ్యూ

Next Post

1997 తెలుగు మూవీ రివ్యూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In