తన భర్త చినపోయక ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు శ్రీహరి భార్య డిస్కో శాంతి. బాలకృష్ణ ఒక్కరే కాల్ చేసి తన బాగోగులు అడిగారని గుర్తుచేసుకున్నారు.
“నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగి ఉంటే.. బావ చనిపోయిన తర్వాత.. శాంతి ఏం చేస్తుందని నా గురించి ఆరా తీసేవారు.. అడిగేవారు. కానీ నేను సినిమాలకు దూరం అయ్యాను కాబట్టి.. ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో ఇవన్ని మాములే. శ్రీహరి చనిపోయిన తర్వాత ఓ సారి బాలకృష్ణ గారు మా ఇంటికి కాల్ చేశారు. ఆయన సినిమాలో బావ ఏదో ఒక క్యారెక్టర్ చేశారంట. దానికి సంబంధించి ఏమైనా డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయా.. ఏమైనా సాయం కావాలా అని అడిగారు. బాలకృష్ణ గారికి అలా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన కాల్ చేసి మా బాగోగులు ఆరా తీశారు. బావ చనిపోయిన తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బాలకృష్ణలా ఎవరూ కాల్ చేయలేదు” అన్నారు శాంతి…!!
Score ; https://youtu.be/nJAoGta0W8g