*.తెలంగాణ మట్టి వాసన చూడబోతున్న కొత్త గాయని గాయకులు:
జాజుల శ్రీనివాస్ బీసీ సంఘాల జాతీయ నాయకులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్యం భాష , యాస మట్టి వాసన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంలో ఉంటుందని భవిష్యత్ తరాలకు ఇది ఒక దిక్సూచి , వరల్డ్ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోబోతుందని బీసీ సంఘాల జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి లోని “నూరేండ్ల నా ఊరు” గేయ కావ్యం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గోల్కొండ బిక్షపతి అధ్యక్షతన జరిగింది. సిని, రాజకీయ నాయకుల సమక్షంలో రచయిత, గాయకుడు గూడూరు మహేష్ కు శాలువాతో ఆత్మీయ ఘన సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం చరిత్ర సృష్టిస్తుందని వరంగల్ శ్రీనివాస్ రచయిత తెల్ల కాగితం లాంటివాడని, తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సహాయ సహకారాలు వరంగల్ శ్రీనివాస్ కు అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వరంగల్ శ్రీనివాస్ రాసిన నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం గురించి వివరించడం జరుగుతుందని, గ్రూప్ 2 లో ప్రశ్నగా నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం ప్రశ్నగా వచ్చిందనీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తిరిగి కొత్త గాయని నాయకులకు ప్రోత్సహించడం అదృష్టమని , వరంగల్ శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ తో ఉండి ఆయనకు తెలంగాణ పాటలపై మమకారాన్ని పెంచిన వాడని, నూరేండ్ల నా ఊరు ఈ గేయ కావ్యంలో 243 చరణాలు ఉంటాయని కొత్త గాయని గాయకులు ఇందులో పాల్గొని పాటలు పాడుతారని వారి ప్రతిభను వెలికితీయడానికి ఈ వేదిక చాలా అవసరమైందని కొత్త గాయని గాయకులకు ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు. ఈ గేయకావ్యం రికార్డు కాకముందే చరిత్ర సృష్టించిందని తెలుగు ప్రజలు గర్వించేలా గేయ కావ్యం ఉంటుందని అన్నారు తెలంగాణ సామాజిక, రాజకీయ అసమానతలపై తెలంగాణ ఉద్యమంపై పాటలు రాసి మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన రచయిత, గాయకుడు వరంగల్ శ్రీనివాస్ చేశారనీ ఇది మన అదృష్టమని ఆయన అన్నారు మరో వంద సంవత్సరాలు ఈ గేయ కావ్యం భవిష్యత్ తరాలకు దిక్సూచిలా ఉంటుందని ఆయన అన్నారు
సినిమా దర్శకులు వి సముద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రచయిత , సంగీత దర్శకుడు వరంగల్ శ్రీనివాస్ చాలా గొప్ప రచయితనీ దర్శక దిగ్గ జుడు దాసరి నారాయణకు ఎన్నో పాటలు రాశాడు మంచి సన్నిహి తంగా ఉన్న దాసరికి ఎంతో సాహిత్యాన్ని అందించారని, నా కొత్త చిత్రాలకు పాటలు, సంగీతాన్ని అందిస్తున్నారు ఈ పాటలు చరిత్ర సృష్టించాబోతున్నాయని నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం లో 243 చరణాలు ఉన్నాయని ఒక చిత్రం కోసం ప్రేమికుల సన్నివేశం ఉందని వరంగల్ శ్రీనివాస్ కు చెప్పడంతో ఒక్క సిట్టింగ్ లోనే పాట రాసి నాకు ఇచ్చాడని చాలా టాలెంట్ ఉన్న గొప్ప రచయిత అని అన్నారు.
కవి, గాయకుడు రచయిత వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన గాయని గాయకులను భవిష్యత్ తరాలకు అందించాలని ఉద్దేశంతో నూరేండ్ల నా ఊరు గేయ కావ్యం లో 243 చరణాలు ఉన్నాయని ఈ చరణాలకు 73 మంది స్త్రీలు 171మంది పురుషులు కొత్త గాయని, గాయకులుగా పరిచయం అవుతున్నారు. 243 మంది నృత్య దర్శకులు నూరేండ్ల నా ఊరు గేయ కావ్యంకు నృత్య దర్శకత్వం వహిస్తున్నారని ఇది ఒక భావితరాలకు బంగారు బాట వేస్తుందని గాయని గాయకులకు కళాకారులు గొప్ప వేదిక అని ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవాలని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో హీరో రవిజంగ్ మల్లిక్ తేజ, అందే భాస్కర్ ,డబ్బు స్వామి, రేలా ప్రసాద్, గజ్వేలు వేణు, తోపాటు తదితరులు పాల్గొన్నారు