ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన యంగ్ హీరో వరుణ్ సందేశ్ … ఇప్పుడు ఓ డిఫరెంట్ రోల్ పోషించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాడు. ఎమ్3 మీడియా పతాకంపై మహా మూవీస్ సౌజన్యంతో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో…. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ప్రమోషన్స్ తో ఇప్పటికే అంచనాలను పెంచిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం పదండి.
స్టోరీ: ఓ పది మంది వ్యక్తులు వివిధ కారణాలతో కొండమీద ఉన్న పాడుబడ్డ ఓ పిచ్చాసుపత్రిలోకి రావాల్సి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ మోసపోయి ఇక్కడికి వచ్చామని తెలుస్తుంది. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ బడ్డ ఆ పిచ్చాసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఒకరి తర్వాత ఇంకొకరు దారుణ హత్యకు గురవుతూ వుంటారు. ఆ టైంలో వరుణ్ సందేశ్ కూడా మిగతా వారి లాగే ఆ పిచ్చాసుపత్రిలోకి వస్తాడు. వరుణ్ సందేశ్
వచ్చిన తర్వాత… ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి బయటపడింది ఎవరు? అసలు వరుణ్ సందేశ్ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ కథనం విశ్లేషణ: సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూని తీసుకొని, దానికి థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా చివరి వరకు ట్విస్టులేవి రివిల్ చేయకుండా కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది.
ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన వరుణ్… ఇందులో ఒక వైవిద్యమైన రోల్ పోషించి మెప్పించారు. సి.ఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయినా… బాగా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఆర్టిస్టులు ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా చాలా క్వాలిటీగా తెరకెక్కించారు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ వీకెండ్ లో సరదాగా చూసేయండి.
Rating: 3.5