భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు ప్రభాస్ హీరోగా చేస్తున్న ఆది పురుష్ కి. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలి కాలంలో జరగనున్న బిగ్గెస్ట్ ఈవెంట్ గా నిలవబోతోంది. ఓం రౌత్ దర్శకత్వం వహించి ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదలకు ముందు, మేకర్స్ సినిమా ప్రమోషన్ విషయంలో విపరీతమైన శ్రద్ధ వహిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రమోషన్స్ని చాలా వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకి ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మరెవరో కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు మరియు యోగి సన్యాసి అయిన చిన జీయర్ స్వామి. ఆయన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి తన దైవిక ఆశీర్వాదాలను కురిపించనున్నారట.
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరగబోతున్న మరికొన్ని విషయాల గురించి చెప్పాలి అంటే..చరిత్రలో తొలిసారిగా… ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాముడు మరియు వేంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి యొక్క అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య యొక్క భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఆదిపురుష్ మరియు రామాయణం పాటలకి ఈ ఈవెంట్లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మరో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఈ ఈవెంట్ కి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ లెవెల్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి 1 లక్ష + మంది భారీ ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నారు.
ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించే ఈ భారీ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా ప్లాన్ చేస్తోంది.
Adipurush getting bigger and bigger; huge arrangements for pre-release event in Tirupati
For the first time in the history of Indian cinema, a pre-release event of a film is being held at a level that will be remembered for ages to come. Adipurush’s pre-release event is going to be the biggest event to be held in recent times. The Prabhas and Kriti Sanon starrer, directed by Om Raut is hitting the screens on June 16 and ahead of the release, the makers are leaving no stone unturned when it comes to promoting the film.
The chief guest of the event is none other than Chinna Jeeyar Swamy, the religious guru and yogi ascetic known for his spiritual discourses. He will be gracing the event and showering his divine blessings on the team.
For the first time in history… 50 feet hologram image of Prabhas will be presented at the event. A huge set of Ayodhya is being erected in Tirupathi as Lord Rama and Lord Venkateswara Swamy are the Avatars of Vishnu Murthy and that makes the connection between Adipurush and Tirupathi stronger.
100 dancers and 100 singers will be performing for the songs of Adipurush and The Ramayana. The entire event is being directed by Prashanth Varma and a huge crowd of 1 Lakh + people are expected to grace the event.
Shreyas Media is planning this first-of-its-kind massive event which will be hosted by Jhansi.