నెల్లూరు : రాష్ట్రంలో పట్టభద్రుల సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ పట్టబద్రుల వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అధికార వైసీపీ నుంచీ నామినేషన్లు దాఖలు చేసిన ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఇప్పటికే నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పట్టభద్రులను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వారితో మమేకమై ప్రచారంలో మిగిలిన అభ్యర్థులకంటే ముందంజలో దూసుకుపోతున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప తదితర జిల్లాల్లో ఆయన పట్టభద్రులను కలుసుకుంటున్నారు. కళాశాలలు, విద్యా సంస్థలకు వెళ్లి అక్కడ పట్టభద్రులతో సమావేశమైన ప్రచారం కొనసాగిస్తున్నారు. గుడ్ మార్నింగ్ నెల్లూరు, గ్రాడ్యుయేట్లతో మాటా మంతి, వాక్ విత్ వాకర్స్ క్లబ్ లాంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ వినూత్న పథంలో దూసుకెళుతున్నారు.
ఒక సామాన్య రైతు కుటుంబం నుంచీ వచ్చిన పేర్నాటి శ్యామ్ ప్రసాద్‌రెడ్డి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ప్రజలందరికీ ఎంతో చేరువయ్యారు. ఎంతో సౌమ్యుడైన పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రజలందరితో ఇట్టే మమేకమవుతుంటారు. అన్ని పార్టీల నేతలతోనూ, అన్ని వర్గాల ప్రజలతో ఆయన సన్నిహిత సంబంధాలున్నాయి. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రజలు చెప్పే సమస్యలను ఓపిగ్గా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యేలా నిరంతరం శ్రమిస్తున్న పేర్నాటి అంటే నెల్లూరు, తిరుపతి ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కు ఎంతో ఇష్టమైన పేర్నాటి ప్రజా సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తోడ్పడుతుంటారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న పేర్నాటి ప్రచారంలో సైతం వినూత్న పంథాలో దూసుకెళుతున్నారు. మిగిలిన అభ్యర్థుల ప్రచారాలకు భిన్నంగా ఆయన నేరుగా పట్టభద్రులను విరివిగా కలుస్తున్నారు. వారందరితో మమేకమై వారందరి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ప్రచారంలో పట్టభద్రులందర్నీ దాదాపుగా కలుసుకున్న పేర్నాటి ప్రాచారాన్ని మరింత ఉధృతం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. తాను సాదారణ రైతు కుంటుంబంలో జన్మించానని రైతులు, గ్రామీణ సమస్యలతో పాటు పట్టభద్రులు ఎదుర్కొంటున్నసమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం శాసనమండలిలో తన వాణి వినిపించి వారి సమస్యల పరిష్కారినికి కృతి చేస్తానని తెలిపారు. వైసీపీ తరఫున తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు తాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు. ప్రచారంలో తనకు గ్రాడ్యుయేట్ల నుంచీ అపూర్వ ఆదరణ లభిస్తోందని, భారీ మెజార్టీతో తాను విజయం సాధించడం ఖాయమని పేర్నాటి ధీమా వ్యక్తం చేశారు.