నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలోని స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసముండే కామాక్షమ్మ ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త మరణించాడు. ఇదిలా ఉండగా బుధవారం ఆమె తన ఇంట్లో వంట చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా సాలు చింతల గ్రామానికి చెందిన వెంకట్ అనే యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. తన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే బ్లేడుతో మహిళ గొంతు కోశాడు.. శరీరంపై గాయాలు చేశాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో అతను ఇంటి బయట ఉన్న మరో యువకుడితో కలిసి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయాలైన మహిళను బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చించారు. అయితే, గత కొన్ని రోజులుగా గుర్తు తెలియని యువకులు ఫోన్లో తనను వేధిస్తున్నారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.