గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి నటించిన SPEED 220 ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు.
విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “SPEED220”
ప్రముఖ దర్శక నిర్మాత *తమారెడ్డి భరద్వాజ* ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభతో ఉన్నదని కొనియాడారు.
*చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ* మంచి కథతో మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. కథ వినిన వెంటనే ఈ కథని మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని నిర్ణయించుకున్నాం అన్నారు.
ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్ళకి కనిపించే విధంగా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు అన్నారు.
*చిత్ర దర్శకుడు హర్ష బీజగం మాట్లాడుతూ* నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆర్ఎక్స్ 100 ల ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం శేఖర్ మోపురి, కెమెరామెన్ క్రాంతి కుమార్, ఎడిటర్ రామకృష్ణ. టెక్నిషియన్స్ అందరూ వాళ్ల శాఖలలో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు
ఆగస్టు 23వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ SPEED 220 చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాము అన్నారు.
The trailer of SPEED 220 was launched by producer and director Tammareddy Bharadwaj.
The movie, starring Ganesh, Hemanth, Preethi Sundar, and Jahnavi, is produced under the banner of Vijayalakshmi Productions by Kondamuri Phani, Mandapalli Suryanarayana, and Madineni Durga Rao.
While launching the trailer, the esteemed director and producer Tammareddy Bharadwaj praised it, saying that the trailer was excellent and reminiscent of the movie “RX 100,” with a unique storyline, diverse characters, and impressive direction.
Producer Phani mentioned that when director Harsha approached them with this good story, they immediately decided to produce the movie under the Vijayalakshmi Productions banner after hearing the script. The movie portrays a beautiful love story, highlighting the current challenges faced by lovers and the conflicts that arise due to love, all brought to life by the director.
Director Harsha Bijagam expressed his gratitude to the producers for giving him this opportunity and confidently stated that this film, like “RX 100,” will also be a big success.
The film’s music is composed by Shekhar Mopuri, with cinematography by Kranthi Kumar and editing by Ramakrishna. Each of them has done an exceptional job in shaping the movie.
“SPEED 220” is set to be released nationwide on August 23rd, and the team is hopeful that the audience will embrace it.