ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని సంవత్సరం పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా అమరావతి రైతుల ఉద్యమంలో కొలికపూడి కీలకంగా వ్యవహరించారు!!