రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి, సీఎం కేసిఆర్ హార్డ్ కోర్ అభిమానిని మీకు పరిచయం చేస్తున్నాను. స్వరాష్ట్రం కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రీయాశీలక భాగస్వామ్యం అయ్యింది.సిరిసిల్ల నియోజకవర్గంలో నాకు గట్టి మద్దతు దారు కూడ… అంటూ.. ఆదివారం రాష్ట్ర పురపాలక, ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో చీర్లవంచకు చెందిన జిందం సత్తమ్మ గురించి ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రశంసపూర్వక వాఖ్యలు రాశారు. ఆమెతో ఉద్యమ సమయంలో, స్వరాష్ట్రంలో మంత్రిగా వివిధ సందర్భాలలో కలిసిన ఫోటోలను జత చేశారు.తెలంగాణ ఉద్యమంలో సత్తమ్మ చేసిన పోరాటం, ఉద్యమ భావజాల వ్యాప్తికి చేసిన కృషిని గుర్తుపెట్టుకుని మరి ప్రత్యేకంగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రశంసించడం
కేటీఆర్ మంచి మనసుకు, అభిమానుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని అభిమానులు పేర్కొంటున్నారు.
జిందం సత్తమ్మ నేపథ్యం ఇదే…
జిందం సత్తమ్మ …. సిరిసిల్ల నియోజకవర్గంలో ఈ పేరు తెలియని వారు బహుశా ఉండక పోవచ్చు.
తంగళ్ళపల్లి మండలం చీర్ల వంచ గ్రామానికి చెందిన మహిళ. మధ్య మానేరు జలాశయంలో చీర్లవంచ ముంపుకు గురవ్వడంతో ప్రస్తుతం అగ్రహారం చీర్లవంచ ఆర్ అండ్ ఆర్ కాలనీ లో నివాసం ఉంటుంది.
తెలంగాణ ఆందోళనలో చురుగ్గా పాల్గొంది.
కేసిఆర్ కు కరుడు గట్టిన అభిమాని. కేటీఆర్ అంటే ప్రాణం.
చదువుకోక పోయినా… ఉద్యమ నాయకుడు కేసిఆర్ ప్రసంగాలు విని , స్వరాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం ను తెలుసుకుని ఉద్యమ ప్రారంభం నుంచి ఉద్యమ బాట పట్టింది. అవహేళనలు ఎదురైన చుట్టూ ఉన్న ప్రజల్లో ఉద్యమ భావ జాలవ్యాప్తికి కృషి చేసింది.
సిరిసిల్ల శాసన నియోజవర్గ ఎన్నికల్లో కేటీఆర్ 2009 నుండి మొదటిసారి పోటీకి దిగడంతో అప్పటి నుండి ఇప్పటి వరకూ కేటీఆర్ గట్టి మద్దతు దారు గా వెన్నంటే ఉంటుంది. మంత్రి శ్రీ కే తారక రామారావు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతి సారీ అన్ని కార్యక్రమాలకు హాజరువుతుంది. జై తెలంగాణ అంటూ నినదిస్తుంది.