* కొత్త సంవత్సరంలోనూ బీసీలపై దాడి మొదలుపెట్టిన టీడీపీ, జనసేన
టీడీపీ, జనసేన రౌడీ మూకలు రెచ్చిపోయారు.. ఒక బీసీ మహిళా మంత్రి అని చూడకుండా మూకుమ్మడిగా దాడి చేశారు. ఆఖరుకి నూతన సంవత్సరం నాడు కూడా వీరి అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ఒక మహిళా నాయకురాలి ఆస్తులు ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారు. కొత్త సంవత్సరంలో బీసీలపై దాడులు మొదలుపెట్టిన చీడీపీ, జనసేన నాయకులు.. ఏకంగా ఒక బీసీ మహిళా మంత్రి పైనే దాడులకి దిగి బీసీలని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారు. ఆమె కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో పాటు అద్దాలు పగలగొట్టి, ఫ్లెక్సీలు చించి వేసి రౌడిల్లా ప్రవర్తించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. నిత్యం వారి అభ్యున్నతి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాలు బీసీలకు చేసిందేమీ లేదు. అందుకే వాళ్ళను అణగదొక్కాలని చూస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక నూతన సంవత్సరం అని కూడా చూడకుండా దాడికి దిగారు. బీసీలపై ఇంత కక్ష పెంచుకున్న ఈ టీడీపీ జనసేన పార్టీలను వచ్చే ఎన్నికల్లో బీసీలు రాజకీయ సమాధి కడతారు.