• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

admin by admin
June 11, 2026
in movies
0 0
0
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సరికొత్త కంటెంట్ తో త్వరలో రిలీజ్ కు వస్తున్న “సాV3” సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది – డైరెక్టర్ కృష్ణమాయ

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సాV3”. ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమాలో కృష్ణమాయ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈశ్వర్ సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా ఈ రోజు “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా

యాక్టర్ అదిరే అభి మాట్లాడుతూ – నెక్ట్స్ ఇయర్ కు ఈశ్వర్ సినిమా పాతికేళ్లకు చేరుకుంటుంది. అప్పుడు ఓ గెట్ గెదర్ పెట్టుకోవాలని, అందుకు కృష్ణమాయ గారు ఇనిషేటివ్ తీసుకోవాలి కోరుతున్నా. ఈశ్వర్ చిత్రంలో మేము ప్రభాస్ గారి ఫ్రెండ్స్ గా నటించాం. ఆ మూవీతో మాకు మంచి గుర్తింపు దక్కింది. ప్రభాస్ గారు ఈ రోజు బిగ్ స్టార్ అయ్యారు. ఈశ్వర్ సినిమా టైమ్ నుంచే కృష్ణమాయ మంచి స్నేహితులు అయ్యారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న “సాV3” సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో సామ్రాట్ మాట్లాడుతూ – ప్రభాస్ గారు మా అందరికీ ఫేవరేట్ హీరో. ఆయన ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ కు మేమంతా టీమ్ గా వెళ్లి థియేటర్స్ లో సినిమా చూస్తాం. ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మా మూవీ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం హ్యాపీగా ఉంది. “సాV3” సినిమా కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరూ మూవీ చాలా బాగుందంటూ చెబుతున్నారు. ఈ సినిమా కోసం కృష్ణమాయ గారితో పాటు మేమంతా హార్డ్ వర్క్ చేస్తున్నాం. మేము పడిన కష్టం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాం. అన్నారు.

హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ – ప్రభాస్ గారి ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మా సినిమా నుంచి ట్రిబ్యూట్ గా ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. “సాV3” సినిమా డబ్బింగ్, ఎడిటింగ్ దశలోనే అందరిలోనూ పాజిటివ్ వైబ్స్ ఏర్పడుతున్నాయి. ఈ సినిమా ఔట్ పుట్ మేము అనుకున్నదాని కంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా “సాV3” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.

నటి శ్రావణ సంధ్య మాట్లాడుతూ – డైరెక్టర్ కృష్ణమాయ నాకు గతంలో రైల్వే స్టేషన్ మూవీలో నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమా టైమ్ లో రిహార్సల్స్ చేయించి పర్పెక్ట్ గా వచ్చేలా షూటింగ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రంలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. “సాV3” సినిమా నా క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేసేలా ఉంటుంది. అన్నారు.

సెకండ్ హీరోయిన్ హారిక రవి మాట్లాడుతూ – ప్రభాస్ గారి ఈశ్వర్ సినిమా మా అందరికీ ఫేవరేట్ మూవీ. నేను ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు పుట్టలేదు అనుకుంటా. ఇప్పుడు 4కె లో రీ రిలీజ్ అవుతోంది. మేమంతా థియేటర్స్ లో చూస్తాం. “సాV3” సినిమాలో నాకు సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన కృష్ణమాయ గారికి థ్యాంక్స్. ఆయన యాక్టింగ్ ను ఫాలో అవుతూ ఈ క్యారెక్టర్ చేశాను. అన్నారు.

అతిథిగా వచ్చిన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ – మా ఈశ్వర్ చిత్రంతో పరిచయమైన ప్రభాస్ గారు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా మళ్లీ రీ రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా “సాV3” సినిమా తరుపున ఒక ట్రిబ్యూట్ గా కృష్ణ మాయ ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటం హ్యాపీగా ఉంది. కృష్ణమాయ చాలా ప్లాన్డ్ గా ఈ సినిమాను చేశాడు. సినిమా కంప్లీట్ చేసి ప్రమోషన్ మొదలుపెట్టాడు. ప్రతి రూపాయి సినిమా మీద ఖర్చు పెట్టాలని అతని ఆలోచన. పాటలు బాగున్నాయి. సినిమా కూడా బాగా చేశాడు. దాసరి గారు, కోడి రామకృష్ణ గారిలా మట్టిలో మాణిక్యాలు ఏరే దర్శకుడు కృష్ణమాయ. ఈ సినిమాతో అమ్మాయి లిఖితకు మంచి పేరు రావాలి. ఈ మూవీ తప్పకుండా హిట్ కావాలి. కృష్ణమాయకు సినిమా మీద ప్యాషన్. మా మూవీస్ కు వర్క్ చేసేప్పుడు ఏ పనిచెప్పినా వెంటనే చేసేవాడు. ఇండస్ట్రీ ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓటీటీల వల్ల థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం లేదు. కంటెంట్ బాగుంటే తప్ప మూవీస్ గట్టెక్కడం లేదు. ఈ సినిమా మంచి కంటెంట్ తో వస్తోంది. ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ – ఈశ్వర్ సినిమాకు నేను ఆర్ట్ డైరెక్టర్ తో పాటు నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించాను. ఈ సినిమా మాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈశ్వర్ చిత్రంలో నటిస్తున్నప్పుడు మూవీ ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదు. ప్రభాస్ గారు, అభి, నేను, హనుమంతు..ఇలా అంతా సరదాగా కలిసి చేశాం. ప్రభాస్ కూడా మాతో పాటు సరదాగా ఉండేవారు. అంతా చిన్న పిల్లల్లాం ఆడుతూ పాడుతూ సినిమా చేశాం. కిందే కూర్చుని కలిసి భోజనం చేసేవాళ్లం. ఈ రోజు ప్రభాస్ గారు పెద్ద స్టార్ అయ్యారు. అంత పెద్ద స్టార్ మొదటి చిత్రంలో మేమంతా కలిసి నటించాం అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. అశోక్ కుమార్ గారు నాకు గురువు లాంటివారు. ఆయనను చూసే ప్రొడక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఎవరికీ రూపాయి బ్యాలెన్స్ పెట్టకుండా కాంపాక్ట్ బడ్జెట్ లో పద్ధతిగా సినిమా ఎలా నిర్మించాలో అశోక్ కుమార్ గారి దగ్గర తెలుసుకున్నాను. “సాV3” సినిమా విషయానికి వస్తే నేను డైరెక్షన్ చేస్తూ నిర్మిస్తున్నాను. సరికొత్త కంటెంట్ తో ఈ సినిమాను రూపొందించాను. త్వరలోనే థియేట్రికల్ గా సినిమాను రిలీజ్ చేస్తాం. మా హీరో హీరోయిన్స్ అందరూ అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. “సాV3” సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ – ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీ ముందుకు మరోసారి మా టీమ్ రావడం హ్యాపీగా ఉంది. ఇక మా చిత్రం గురించి మాట్లాడాలంటే.. “సాV3” ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది. ఈ సినిమాతో మా టీమ్ అందరికీ మంచి గుర్తింపు దక్కుతుందని నమ్ముతున్నాం. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ తో “సాV3” సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

ప్రొడ్యూసర్ వి. విజయ మాట్లాడుతూ – “సాV3” వంచి మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మూవీతో పెద్ద విజయాన్ని అందుకోబోతున్నాం. మా ఆర్టిస్టులంతా తమ పర్ ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. అన్నారు.

నటీనటులు – సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత, తదితరులు

టెక్నికల్ టీమ్
———————
స్టంట్స్ – అఖిల్
ఎడిటర్ – శివ శర్వాణి
డీవోపీ – పవన్ మణి
మ్యూజిక్ డైరెక్టర్ – సాయి కార్తీక్
ప్రొడ్యూసర్ – వి. విజయ
ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – కృష్ణ మాయ
పీఆర్ఓ – బి.వీరబాబు

Previous Post

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్
movies

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

by admin
June 11, 2026
0

...

Read more
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In