పవన్ కల్యాణ్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకోలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేసారు.తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియాప్రతినిధులతో ఆయన శనివారం మాట్లాడారు. కోవిడ్ నేపధ్యంలో జనసమీకరణ జరిగితే ఇబ్బందులు ఉంటాయని పోలీసులు జాగ్రత్తలు తీసుకుని ఉండవచ్చు. బలప్రదర్శన జరిగితే కోవిడ్ విస్తరించవచ్చు. ఇప్పుడిప్పుడే కోవిడ్ తగ్గుతోంది. కోవిడ్ కు సంబందించి అక్టోబర్ క్రూషియల్ అంటున్నారు.అందరం గండం దాటుకుని వచ్చాం. అందరి సేఫ్టీ ముఖ్యం.వాళ్ల సెక్యూరిటి,ప్రజల సేఫ్టీ అవసరం. దానిలో భాగంగా నియంత్రణ చర్యలు చేపట్టి ఉంటారు తప్ప అంతకుమించి మరేమి లేదు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు కూడా బయట పర్యటనలకు రావాలంటే కోవిడ్ నేపధ్యంలో హెజిటేట్ చేస్తున్నారు. ఆయన ఒక్కసారి బయటకు వస్తే పెద్దఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది. ప్రజల మధ్యనే ఉండాలనేది ఆయనకు ఇష్టం. రాకుండా ఉండాల్సిన పరిస్ధితి కారణంగా ముఖ్యమంత్రి బాధపడుతున్నారు. స్ధానికసంస్దల ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా గాని బయటకు రాకపోవడానికి ఇదే కారణం. పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు వచ్చినప్పుడు జనం రావడమనేది అసహజమేమి కాదు.సినీనటుడు కాబట్టి అభిమానులు వస్తారు. మాలాంటి వాళ్లు వచ్చినప్పుడు అలాంటి ప్రదర్శన చేస్తే అర్ధం ఉంటుంది కాని,ఆయన ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నారో మాకు అర్ధం కావడం లేదు.పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు వస్తే వేయి,రెండువేలమంది జనం రావడం అనేది సహజం. ఆ మాత్రం కూడా రారనుకుంటే ఆయనకు ఆయనే అవమానించుకున్నట్లే. కోవిడ్ పరిస్ధితుల్లో వాళ్లకు వాళ్లే సమీకరణలు వద్దు అని నియంత్రించుకోవాల్సిన నేపధ్యంలో అక్కడకు వచ్చి యుధ్దం చేస్తాం…పోరాటం చేస్తాం అని పిలుపు ఇచ్చి టెంపో క్రియేట్ చేసుకోవడమే కాక ప్రభుత్వం ఏదో అడ్డుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.ఇది విడ్డూరంగా ఉంది.
పవన్ కల్యాణ్ ఇంతా చేసి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రోడ్లు గుంటలు పూడ్చడానికి అని చెబుతున్నారు. అసలు రోడ్ల గుంతలు నువ్వు పూడ్చటం ఏంటి. రూ. 2,200 కోట్లతో రోడ్ల మరమ్మత్తులు చేసేందుకు టెండర్లు ప్రభుత్వం పిలిచింది. వర్షాల్లో ఎవ్వరూ కూడా రిపేర్లు చేపట్టరు.అదృష్టవశాత్తు గత రెండు సంవత్సరాల కాలంలో వర్షాలు మంచిగా పడ్డాయి.దానివల్ల రాష్ర్టానికి ఎంతో మేలు జరిగింది.దాంతోపాటు చిన్నపాటి కష్టం కూడా రోడ్ల రిపేర్ల (గుంతలు)రూపంలో వచ్చింది. రెయినీ సీజన్ లో రోడ్ల మరమ్మత్తులు వేల కోట్ల రూపాయలతో ఎవరూ చేయరు. అలా చేపడితే వాళ్లను మెంటల్ కేసులంటారు. రెయినీ సీజన్ ముగియగానే నవంబర్ ఆఖర్లో పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలకు దెబ్బతిన్న వేల కిలోమీటర్ల రోడ్లకు సంబందించి కేవలం రిపేర్లకే 2,200 కోట్ల రూపాయలు కేటాయించారు.
ప్రతి దానిని ప్రశ్నిస్తున్నానని పవన్ కల్యాణ్ వల్లె వేస్తుంటారు.మరి తెలుగుదేశం హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్ల రిపేర్లకు ఎంత ఖర్చు పెట్టారు.మేం అధికారంలోకి వచ్చాక ఎంత ఖర్చు చేశారో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసారా….నాకు తెలిసీ తెలుగుదేశం హయాంలో 800 కోట్లు ఖర్చు చేశారు.మేం మొదటిసారిగా 2,200 కోట్లతో రోడ్లన్నీ బాగుచేయాలనే ప్రణాళికతో వెళ్తున్నాం. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు.గుంతలు పూడ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు.ఇప్పుడు వచ్చి ఎక్కడో రెండు తట్టల మట్టి పోస్తే ఏమవుతుంది. వర్షాలు తగ్గాక పనులు మొదలుపెడదామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. అసెంబ్లీలో ప్రకటించి టెండర్లు ఫైనలైజ్ అయ్యాక ఇప్పుడు వచ్చి గుంతలు పూడిస్తే ఏమవుతుంది.వెనకటికి అందరూ కలసి కొండ ఎత్తితే ఒకాయన వచ్చి ఆ కొండ కింద వేలు పెట్టి నా వల్లనే ఈ కొండ లెగవగలిగింది అన్నాడంట. అలా అనుకుంటే వారికి నమస్కారం పెట్టడం మినహా చేయగలిగింది ఏమీ లేదు.మీ మీడియాలో కూడా దాన్లో చర్చలకు అవకాశం ఉందనుకుంటే అందరికి నమస్కారం చేయడం మించి ఏమీ చేయలేం.అని సజ్జల అన్నారు.