మారబత్తుల మోహనరావు సమర్పణలో, కె.ఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై, మారబత్తుల బ్రహ్మానందం నిర్మాతగా, బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” సైదులు “. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సైదులు మూవీ జులై 7వ తేదీన ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ద్వారా ” MX player, Hungama, Airtel Xstream, Vi OTT లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుని, ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని వన్ మిలియన్ కి పైగా వ్యూస్ తో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మెచ్చుకున్న ఇండస్ట్రీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.
సీనియర్ నటుడు బెనర్జీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో హీరోగా రంజిత్ నారాయణ్ కురుప్, హీరోయిన్ గా ముస్కాన్ అరోరా నటించారు. ఈ వారంలోనే అమెజాన్ లో కూడా సైదులు స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.యస్ మణికర్ణన్
సంగీతం:ఎన్.ఎస్.ప్రసు
లిరిక్స్: ఎమ్. బ్రహ్మానందం
కో-డైరక్టర్:పవన్ లక్ష్మణ్
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన సావ్దేకర్, వి.పద్మ
ఆర్ట్:రమేష్
ప్రొడక్షన్ మేనేజర్: చంద్రారెడ్డి
పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి
నిర్మాత: మారబత్తుల బ్రహ్మానందం
రచన- దర్శకత్వం: బాబా.పి.ఆర్.