సినిమా పరిశ్రమలో కష్ట సుఖాలు, ఒడిదుడుకులను దాటుకుని వచ్చిన వారే విజేతలుగా నిలబడతారు. దీనికి బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ నిదర్శనమని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తెలిపారు. మణి దీప్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై కౌశల్ మంద, లీషా ఎక్లైర్స్ (Leesha Eclairs) హీరో హీరోయిన్ లుగా శంకర్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రైట్” రూపొందించారు. మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన ‘మెమోరీస్’ చిత్రాన్ని తెలుగులో నిర్మాతలు లుకలాపు మధు, మహంకాళి దివాకర్ లు సంయుక్తంగా రీమేక్ సినిమాగా నిర్మించారు. డిసెంబర్ 30న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు.
ఈ సంధర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ… స్వశక్తితో ఎదిగిన వ్యక్తి కౌశల్, తనకంటూ ఒక ఆర్మీనే రూపొందడం సామాన్యమైన విషయం కాదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఎన్నో స్ట్రగుల్స్ చూసి వచ్చిన, కష్టపడే తత్వమున్న కౌశల్ ఇయర్ ఎండింగ్ లో హిట్ కొట్టి తన ప్రస్థానాన్ని కొనసాగించాలని అన్నారు. రైట్ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని ఆశించారు. ఇదే సందర్భంగా ప్రముఖ నటుడు విజయకాంత్ మరణం తీరని లోటని, సినిమా రూపంలో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారని తెలిపారు. నటుడిగానే కాకుండా మంచి రాజకీయ ఆలోచనా విధానం ఉన్న వ్యక్తని, ప్రతీ రోజూ చెన్నై లో ఆయన ఇంటి ముందు 2, 3 వందల మంది వచ్చేవారిని, ఆకలితో వచ్చిని ఏ ఒక్కరినీ అన్నం పెట్టకుండా పంపక పోయేవారని గుర్తు చేసుకున్నారు.
అనంతరం రైట్ సినిమా హీరో కౌశల్ మాట్లాడుతూ.., నటుడిగా మంచి పేరు సంపాదించాలని 18 ఏళ్ల వయసులో రాజ కుమారుడు సినిమాతో పరిశ్రమకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. 24 ఏళ్ల తరువాత బిగ్ బాస్ రూపంలో తనకు కలసి వచ్చిందని, తన కోసం ఒక ఆర్మీ తయారు కావడం అదృష్టమని అన్నారు. తన ఆర్మీ అందరినీ కలుసుకోవడానికి దాదాపు 8 నెలలు అన్ని ప్రాంతాలు తిరిగానని, ఆ సమయంలో తన ఫ్యాన్స్ తనని హీరోగా చూడాలనే కోరికను తెలుపడంతో హీరోగా వస్తున్నాను. తన తాత గారు ఆంధ్ర నాట్య మండలిలో ఎస్ వీ రంగారావు, జగ్గయ్య, అల్లు రామలింగయ్య వంటి మహా మహులతో కలిసి నాటకాలు, పరిషత్ లు చేశారు. అంతేకాకుండా తన తండ్రి 8 సార్లు ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ గా నిలిచినా గుర్తింపు రాలేదని.. కానీ తన ఫ్యాన్స్ ఆదరణతో మంచి గుర్తంపు వచ్చిందని పేర్కొన్నారు. రీమేక్ రైట్స్ తీసుకున్న తరువాత మొదటి సిట్టింగ్ లోనే ఈ సినిమా తనతోనే తెస్తానని దర్శకులు శంకర్ తెలిపారని అన్నారు. ఆది సాయికుమార్ తో కలిసి బ్లాక్ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ సినిమాకు నిర్మాతలు మహంకాళీ దివాకర్, మధులు పచ్చ జెండా ఊపారన్నారు. కరోనా సమయంలో ఎన్నో ఒడిదుడుకులను దాటుకుని షూటింగ్ పూర్తి చేశాం, ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని కౌశల్ తెలిపారు. చిన్నా, పెద్దా అని తేడాలు లేకుండా అందరినీ ప్రోత్సహించే గొప్ప వ్యక్తి మంచు మనోజ్ ఈ కార్యక్రమానికి వచ్చి టీం ను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని అన్నారు. హీరోగానే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి ఎప్పటికీ సిద్దంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ప్రేక్షకులు చిన్న సినిమాలను కూడా పెద్ద మనసుతో ఆదరించాలని కోరారు. కౌశల్ ప్రయాణం స్ఫూర్తిదాయకం, మహమ్మద్ గజినీలా మళ్ళీ మళ్ళీ పోరాడి సాధించుకునే వ్యక్తిత్వం తనదని హీరో త్రిగూన్ తెలిపారు. ఈ సినిమా హిట్ కొడుతుందని, ఇందులో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
ఇక్కడి సినిమా ప్రేమికులను నమ్మి తాను తెలుగు సినిమాకు వచ్చానని, ప్రేక్షకులు తనకు ప్రోత్సాహం అందించాలని హీరోయిన్ లీషా ఎక్లైర్స్ కోరారు. కౌశల్ ప్రయాణంలో తన భార్య నీలిమ కృషి ఎంతో ఉందని ఆమె గుర్తు చేశారు.
నిబద్దదతో, అనుభవంతో రూపొందించిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకులు శంకర్ వివరించారు.
ఈ కథకు కౌశల్ మాత్రమే సరిపోతారని ఎంచుకుని మరీ రూపొందించామన్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కథను మరింత ఆసక్తికరంగా మార్చి షూటింగ్ పూర్తి చేశామని నిర్మాత మహంకాళీ దివాకర్ తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా సస్పెన్స్ రుచిని అద్భుతంగా చూపిస్తుందని అన్నారు.
వినూత్న సినిమాను విడుదల చేయాలనే తమ ప్రయత్నం విజయం సాధిస్తుందని మరో నిర్మాత మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం విజయ్ కూరాకుల, కెమెరా ఈ వి వి ప్రసాద్, ఎడిటింగ్ తిరుపతి రెడ్డి, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్ అందించగా, 30 ఇయర్స్ పృథ్వి, ఆమని, ముక్తార్ ఖాన్ తదితరులు ముఖ్య తారాగణంగా నటించారు.
చిత్రం పేరు : రైట్ (Right)
బ్యానర్ : మణి దీప్ ఎంటర్టైన్మెంట్
నటి నటులు : కౌశల్ మందా, లీషా ఎక్లైర్స్, 30 ఇయర్స్ పృథ్వి, ఆమని, ముక్తార్ ఖాన్ , తదితరులు..
మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ కూరాకుల
కెమెరా మాన్ : ఈ వి వి ప్రసాద్
ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్
ఎడిటర్ : తిరుపతి రెడ్డి
పి ఆర్ ఓ : పాల్ పవన్
కో – డైరెక్టర్ : రఘు వర్ధన్, భిక్షు
డైరెక్టర్ : శంకర్
నిర్మాతలు : లుకలాపు మధు మరియు మహంకాళి దివాకర్