‘ప్రేమదేశపు యువరాణి’ మువీ ట్రైలర్ లాంచ్ చేసిన మాస్ క దాస్ ‘విశ్వక్సేన్’
యామిని రాజ్, విరాట్ కార్తీక్, యామిన్ రాజ్, ప్రియాంక రెవ్రి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి సునీల్ నిమ్మల దర్శకత్వం వహించాడు. ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సి. హెచ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ట్రైలర్ రిలీజ్ అనంతరం హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. “ప్రేమదేశపు యువరాణి’ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. మేము తీసి ఫస్ట్ సినిమా కంటే చాలా బెటర్ గా ఈ సినిమా తీశారు. హీరో యామినిరాజ్, కిరాక్ కార్తీక్లలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలి ఆల్ ద బెస్ట్” అని అన్నారు.
డైరెక్టర్ సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ.. “మాస్కా దాస్ విశ్వక్సేన్ స్టార్ యాక్టర్గా ఎదిగాడు. అలాంటి వ్యక్తి మా టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. మా టీజర్ని విశ్వక్సేన్ అన్న 3 టైమ్స్ ప్లే చేసుకుని చూసి మా చిత్రాన్ని.. టీమ్ అందరినీ అభినందించారు. మమ్మల్ని నమ్మి ఈ చిత్రాన్ని మంచి బడ్జెని అందించిన మా నిర్మాతలు ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ సి.హెచ్. గారికి ధన్యవాదాలు. మా హీరో యామిని రాజ్ కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. సెకండ్ హీరో కిరాక్ కార్తీక్ గారు కూడా చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ప్రియాంక రెన్రి హీరోయిన్, పవన్ ఈ సినిమాలో విలన్ గా చేశాడు. మా నటీనటులందరికీ థ్యాంక్స్. అందరూ చాలా మంచిగా పెర్ఫార్మ్ చేశారు. విశ్వక్ అన్న ఇందాక అడిగాడు విజువల్స్ చాలా బాగున్నాయి.. మీ కెమెరామెన్ ఎవరు అని? మా కెమెరా మెన్ శివ. శివగారికి థ్యాంక్స్. ఇంత మంచి సినిమాటోగ్రఫీ మాకు అందించినందుకు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ కూడా మంచి సంగీతం అందించారు. మా చిత్రంలో లవ్, కామెడీ, ఎమోషన్ అన్ని వుంటాయి. ప్రేక్షకులకు ఓ సరికొత్త కథను ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఈ చిత్రం అందరికీ మంచి పేరు తీసుకువచ్చి హిట్ అవుతుందని అందరికీ ఒక ప్రొఫైల్లా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. హిట్ కొట్టడం గ్యారంటీ… అందరూ చాలా హ్యాపీగా వున్నాం. ప్రస్తుతం మా టీమ్ లో వున్న రెస్పాన్స్ రేపు యూట్యూబ్లోనే కాకుండా చూసే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాని కొని మా నిర్మాతలకి పెట్టిన డబ్బులకి రెట్టింపు రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. చిన్న చిత్రాలని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే మాలాంటి కొత్తవాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయగలుగుతున్నాం మీ సపోర్ట్ ఇలాగే వుండాలి. అందరికీ అందరికీ ధన్యవాదాలు” అని అన్నారు.
పవన్ కుమార్ ముత్యాల మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను విలన్ కొడుకుగా నటించాను. ఫుల్ లెంగ్త్ పాత్ర చాలా పవర్ఫుల్గా వుంటుంది. విశ్వక్సేన్ అన్నకి థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. మా దర్శకులు సాయి సునీల్గారికి, నిర్మాత ఆనంద్ వేమూరి గారికి, హరిప్రసాద్ గారికి థ్యాంక్స్. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు.. నన్ను ప్రోత్సహించినందుకు. అలాగే మా హీరో గారికి కంగ్రాట్స్. ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో చేయాలి. మీడియా మిత్రులందరూ చిన్న సినిమాలను ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఈ చిత్రంలో మెహబూబ్ బాష, హరికృష్ణ, యోగి కత్రి, రఘు, సునీత మనోహన్, పవన్ ముత్యాల, రాజా రెడ్డి, సందీప్, శ్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపి, నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ : యం.ఆర్. వర్మ, డిఒపి : శివ కుమార్ దేవరకొండ, సంగీతం : అజయ్ పట్నాయక్, లిరిక్స్ : కాసర్ల శ్యామ్, సాయి సునీల్ నిమ్మల, భాను కృష్ణ, కొరియోగ్రఫీ : కపిల్, శ్రీవీర్, సౌండ్ ఎఫెక్ట్స్ : పురుషోత్తం రాజు, ఫైట్స్ : శివ్రాజ్ మాస్టర్, డి.ఐ. : వెంకట్, పి.ఆర్.ఒ. : సినీలోకం బాబు నాయక్ (సినీ సందడి) నిర్మాతలు : ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సి. హెచ్, రచన & దర్శకత్వం : సాయి సునీల్ నిమ్మల.