టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై మణిసాయితేజ-రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్’. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. ఎం. నాగ మునెయ్య (మున్నా) నిర్మాత. నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్ సహ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో సూపర్‌హిట్ అయింది. టి`సిరీస్ ద్వారా విడుదలైన ఆడియో 10 మిలియన్‌లకు దగ్గరగా వెళ్లి రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 2న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా చిత్ర యూనిట్‌ను తన ఇంటికి పిలిపించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమానికి నిర్మాత, నటులు డి.యస్.రావ్, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోo’ దర్శకుడు మోహన్ ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వీడియో బైట్ ద్వారా తన సందేశాన్ని ఇచ్చారు.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ…
నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎంతోమంది జీవితాలు ఈ ఫ్లోరైడ్ నీటి వల్ల నాశనం అయ్యాయి. రాబోయె రెండు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాను పూర్తిగా ఫ్లోరైడ్ రహిత ప్రాతంగా చేస్తాము. ఈ ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని, సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ వంటి సినిమాలను ప్రజలందరూ ఆదరించాలి. దీని ద్వారా సమాజానికి ఈ సమస్య, బాధితుల బాధలు అర్ధమౌతాయి.అందరు థియేటర్ కెల్లి ఈ సినిమాని చూడవల్సిందిగా కోరారు. ఈ చిత్రం తప్పకుండా మoచి విజయం సాధిస్తుంది’ అన్నారు.
డి.యస్. రావు మాట్లాడుతూ…
సినిమా ట్రైలర్, పాటలు చాలా బాగున్నాయి. ఒక చిన్ని సినిమా పాటలు టి`సీరీస్ వారు తీసుకోవడంతోనే పెద్ద విజయం సాధించారు. దర్శక, నిర్మాతలు…అలాగే మంచి మెసేజ్‌కూడా ఉండటం ఈ సినిమా విజయానికి హెల్ప్ అవుతుంది. ‘మెకానిక్’ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్ అందరికీ అభినందనలు చెపుతున్నా’ అనారు.
‘శ్రీకాకుళం షెర్లాక్స్’ దర్శకుడు మోహన్ మాట్లాడుతూ…
మంచి ప్యాషన్ ఉన్న దర్శక, నిర్మాతలు రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే ఆడియో పరంగా సూపర్‌హిట్ అయింది. సినిమా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది’ అన్నారు.
నిర్మాత మున్నా మాట్లాడుతూ…
మా సినిమా ఆడియో మా అంచనాలను దాటి పెద్ద హిట్టు
అయింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో అన్ని కమర్షియల్ అంశాలూ ఉన్నాయి. మా సహ నిర్మాతలు నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండరాశి ఉపేందర్‌ల సహకారం వల్లనే మంచి సినిమా నిర్మించగలిగాను. వారికి నా థ్యాంక్స్. దర్శకుడు ముని సహేకర మల్టీ టాలెంటెడ్. మంచి పర్‌ఫెక్షన్, విజన్ ఉన్న దర్శకుడు, రచయిత. బ్లాక్‌బస్టర్ సంగీతం ఇచ్చిన సంగీత దర్శకుడు వినోద్ యాజమాన్య గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నాం అన్నారు.
దర్శకుడు ముని సహేకర మాట్లాడుతూ…
మంచి చిత్రం రావాలంటే మంచి నిర్మాత దొరకాలి. నాకు మంచి నిర్మాతలే కాదు.. గట్స్ ఉన్న నిర్మాతలు దొరికారు. దేనికి ఎంత అవుతోంది అని ఆలోచించకుండా ఖర్చుపెట్టారు. వినోద్ యాజమాన్యగారు పాటల విషయంలో తన స్వంత సినిమా అన్నట్టుగా ప్రాణం పెట్టి పనిచేశారు. తన రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా మంచి పాటలు రావటానికి మాచేత ఖర్చు పెట్టించారు. ఇందుకు ఉదాహరణ సిద్‌శ్రీరాం గారు మా సినిమాలో ఓ పాట పాడటం ఆనందంగా ఉంది. హీరో, హీరోయిన్‌లు కూడా చక్కగా సూటయ్యారు. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. తనికెళ్ల భరణిగారు అందించిన సహకారం మరువలేనిది. ఆడియో లాగే సినిమా కూడా సూపర్ సక్సెస్ అయి, మా అందరికీ మంచి కెరీర్ ఇస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
కో ప్రొడ్యూసర్‌లో ఒకరైన నంది పాటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..
కథ బాగా నచ్చడం వల్ల ఎక్సైట్ అయ్యి సహ నిర్మాతగా జాయిన్ అయ్యా. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ లేవు.. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అంతే. మా సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా అవుతుంది అన్నారు.
కో`ప్రొడ్యూసర్స్‌లో మరొకరైన కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ…
దర్శకుడు అద్భుతమైన మెసేజ్‌తో కథ రాసుకున్నారు. మా అబ్బాయి మణిసాయి తేజను ఈ చిత్రానికి హీరోగా తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాత మున్నాగారు, దర్శకుడు ముని సహేకర్ గారు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారని చెప్పాలి. ‘మెకానిక్’ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటాడు. విడుదలకు ముందే ఆడియో పెద్ద హిట్ అయ్యి మాకు సక్సెస్‌ను రుచి చూపించింది. ఫిబ్రవరి 2న ఖచ్చితంగా ఇక్కడే సక్సెస్‌మీట్‌ను నిర్వహిస్తాం’ అన్నారు.
హీరో మణి సాయితేజ, హీరోయిన్- రేఖ నిరోషాలు మాట్లాడుతూ.. తమను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాత మున్నా గారికి, దర్శకుడు ముని సహేకర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మా సినిమా ఆడియో ఇంత సూపర్ సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కూడా ఇలాగే సూపర్ సక్సెస్ అవుతుంది. దర్శకుడు ముని గారి టాలెంట్‌కు హేట్సాఫ్. ఆయన చెప్పినదానికన్నా బాగా తెరకెక్కించారు. యూనిట్ అందరికీ మా థ్యాంక్స్’ అన్నారు.
తనకెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, చత్రపతి శేఖర్, సమ్మెట గాంధీ, కిరీటి, జబర్ధస్త్ దొరబాబు, జబర్ధస్త్ పణి, సంద్య జనక్, సునీత మనోహర్,మాస్టర్ చక్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, లిరిక్స్: ముని సహేకర, డీఓపీ: ఎస్.పి. శివరాం, ఎడిటర్: శివ శర్వాణి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: కపిల్ మాస్టర్, బాలు మాస్టర్, పీఆర్వో: బి. వీరబాబు, సహ నిర్మాతలు: నందిపాటి శ్రీధర్‌రెడ్డి, కొండ్రాసి ఉపేందర్, నిర్మాత: ఎం. నాగ మునెయ్య (మున్నా), దర్శకత్వం: ముని సహేకర.
People should support films like ‘Mechanic’ that are useful to society: Minister Komatireddy Venkatareddy
Manisai Teja and Rekha Nirosha-starrer ‘Mechanic’ is coming under the banner of Teenasree Creations. Muni Sahekara has directed and also written the story, screenplay, dialogues and songs. Produced by Mekala Naga Muneiah (Munna), it is co-produced by Nandipati Sridhar Reddy and Kondrasi Upender. The audio of this film is a superhit. The audio released by T-Series is clocking close to 10 million views and creating a record. The film will be released worldwide on February 2.
A pre-release event was held at Prasad Lab in Hyderabad on Monday. Although Telangana Cinematography Minister Komatireddy Venkatareddy was supposed to attend the event as the chief guest, due to his busy schedule, he called the film unit to his house and unveiled the film’s trailer. Afterward, producer and actor DS Rao, ‘Srikakulam Sherlock Holmes’ director Mohan attended the program held at Prasad Lab as chief guests. The Minister gave his message through a video byte.
During the launch of the trailer, the Minister said, “The lives of many people in the fluoride-affected area of Nalgonda district have been severely affected. We will make the district completely fluoride-free in the next two years. Films like ‘Mechanic’, which take this fluoride issue as the main focus and give a message to society, should be supported by all people. Through this, the society will understand this problem and the sufferings of the victims.”
DYS Rao said, “The movie’s trailer and songs are very good. On T-Series, the songs are a hit. Having a director and producers, as well as a good message, will help the success of this film.”
Director Mohan said, “This movie made by a passionate director and producer has already become a superhit in terms of audio. The film will be a success.”
Producer Munna said, “The audio of our movie has become a big hit beyond our expectations. The movie did very well. It includes all commercial elements. I was able to produce a good film like this only because of the cooperation of our co-producers. My thanks to them. Director Muni Sahekara is multi-talented. A director and writer with good perfection and vision he is. We are forever indebted to the music director Vinod who made this blockbuster music. We are releasing the movie on February 2.”
Director Muni Sahekara said, “To get a good film, you need to find a good producer. I found not only good producers but also producers with guts. They spent money without having second thoughts about the budget. Vinod Yajamanya has given life to the songs as if this were his movie. Without thinking about his remuneration, he spent money on good songs. An example of this is Sid Sriram who is happy to sing a song in our film. The hero and heroines are also well-suited. A good message-oriented movie. Tanikella Bharani garu’s contribution is unforgettable. Like the audio, the movie will be a super success and we hope it will give us all a good career.”
Co-producer Nandipati Sridhar Reddy said, “I got excited and joined as a co-producer because I liked the story. There is no such thing as a small movie or a big movie. There is only a hit movie and a flop movie. Our movie will be a hit movie.”
Co-producer Kondrasi Upender said, “The director has written the story with a wonderful message. I am very happy to cast my son Manisai Teja as the hero of this film. It must be said that producer Munna garu and director Muni Sahekara have given their lives for this movie. ‘Mechanic’ will surely impress the audience. We will organize a success meet as well after the release of our movie.”
Hero Manisai Teja and heroine Rekha Nirosha said, “We are forever indebted to producer Munna garu and director Muni Sahekara garu who believed in us and gave us the opportunity to make this film. We are very happy that the audio of our film is such a super success. The movie will also be a super success. Hats off to the talent of director Muni garu.”
Cast:
Tanakella Bharani, Naga Mahesh, Surya, Chatrapathi Shekhar, Sammeta Gandhi, Kiriti, ‘Jabardhast’ Dorababu, ‘Jabardhast’ Phani, Sandhya Janak, Sunita Manohar, Master Chakri and others.
Crew:
Music Director: Vinod Yajamanya; Lyricist: Muni Sahekara; Cinematographer: SP Sivaram; Editor: Siva Sharvani; Fights: Dragon Prakash; Choreography: Kapil Master, Balu Master; PRO: B Veerababu; Co-Producers: Nandipati Sridhar Reddy, Kondrasi Upender; Producer: Mekala Naga Muneiah (Munna); Director: Muni Sahekara.